Smartphone Charge: స్మార్ట్‌ఫోన్‌కి ఎప్పుడు ఛార్జింగ్‌ పెట్టాలి.. 50% కంటే ఎక్కువ మంది పొరపాటు చేస్తున్నారు..!

Smartphone Charge: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీంతో చాలా పనులు చేస్తున్నారు.

Update: 2023-08-16 14:30 GMT

Smartphone Charge: స్మార్ట్‌ఫోన్‌కి ఎప్పుడు ఛార్జింగ్‌ పెట్టాలి.. 50% కంటే ఎక్కువ మంది పొరపాటు చేస్తున్నారు..!

Smartphone Charge: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీంతో చాలా పనులు చేస్తున్నారు. కానీ రోజులో దీనికి ఎన్నిసార్లు ఛార్జింగ్‌ పెడుతున్నారో గమనించారా.. బ్యాటరీ అయిపోవడం వల్ల ఫోన్‌ ఉపయోగించలేము కానీ దీనికి పరిష్కారం తరచుగా ఛార్జింగ్‌ పెట్టడం కాదు. ఒక పద్దతి ప్రకారం ఫోన్‌ని ఛార్జ్ చేయాలి. అప్పుడు బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కొంతమంది ఫోన్‌కు ఎక్కువ సమయం చార్జింగ్ పెడతారు మరికొందరు తక్కువ సమయం పెడుతారు. మరికొందరు పదే పదే ఛార్జ్ చేస్తారు. ఇవన్ని మంచి పద్దతులు కావు. ఎక్కువ ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. తక్కువ ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. పగటిపూట ఫోన్‌ని పదే పదే చార్జింగ్ పెట్టడం ఒక చెడు అలవాటు. ఇలా చేయడం వల్ల కూడా ఫోన్ బ్యాటరీ దెబ్బతింటుంది. అందువల్ల ఫోన్‌ను సరైన మార్గంలో ఛార్జ్ చేయడం అవసరం.

ఫోన్ బ్యాటరీని సరిగ్గా ఉంచడానికి పద్దతులు

1. బ్యాటరీ 20% కంటే తక్కువ ఉన్నప్పుడు ఛార్జింగ్‌ పెట్టాలి.

2. బ్యాటరీ పూర్తిగా అయిపోయే వరకు వాడకూడదు.

3. ఫోన్ బ్యాటరీని 80% అలాగే 100% మధ్య ఉంచడానికి ప్రయత్నించాలి.

4. ఫోన్ 100% ఛార్జ్ అయిన తర్వాత ఛార్జర్ తీసివేయాలి.

ఫోన్ బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 20-80 రూల్‌ని పాటించవచ్చు. ఇది ఫోన్ బ్యాటరీని పాడైపోకుండా కాపాడుతుంది. ఫోన్ బ్యాటరీ 20% లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఛార్జ్‌లో ఉంచుతారు అది 80%కి చేరుకున్నప్పుడు ఛార్జింగ్‌ను తీసివేస్తారు. ఫోన్ బ్యాటరీ రోజుకు రెండుసార్లు 20%కి చేరుకుంటుంది కాబట్టి రెండుసార్లు ఛార్జింగ్ పెట్టాలి. ఇంతకు మించి ఛార్జింగ్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

Tags:    

Similar News