RO Filter Changed: వాటర్ ప్యూరిఫైయర్‌లో RO ఫిల్టర్‌ను ఎప్పుడు మార్చాలి.. తెలియకుంటే ఈ సమస్యలు..!

RO Filter Changed: చాలామంది ఇంట్లో వాటర్‌ ఫ్యూరిఫైయర్‌ అమర్చుకుంటే చాలు తమ పని అయిపోయినట్లుగా భావిస్తారు. కానీ మెయింటనెన్స్‌ సరిగ్గా లేకుంటే ఫ్యూరిఫైయర్‌ సరిగ్గా పనిచేయదు. నీటిని శుద్ధి చేయలేదు.

Update: 2023-09-20 01:30 GMT

RO Filter Changed: వాటర్ ప్యూరిఫైయర్‌లో RO ఫిల్టర్‌ను ఎప్పుడు మార్చాలి.. తెలియకుంటే ఈ సమస్యలు..!

RO Filter Changed: చాలామంది ఇంట్లో వాటర్‌ ఫ్యూరిఫైయర్‌ అమర్చుకుంటే చాలు తమ పని అయిపోయినట్లుగా భావిస్తారు. కానీ మెయింటనెన్స్‌ సరిగ్గా లేకుంటే ఫ్యూరిఫైయర్‌ సరిగ్గా పనిచేయదు. నీటిని శుద్ధి చేయలేదు. అందకు మెషీన్‌ని తరచుగా సర్వీసింగ్‌ చేస్తూ ఉండాలి. వాటర్ ప్యూరిఫైయర్‌లో RO, మెమ్బ్రేన్ నీటిని శుద్ధి చేస్తాయి. కాలానుగుణంగా వీటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ప్రతి 6 నుంచి 8 నెలలకు ఒకసారి మార్చాలి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి 6 నుంచి 8 నెలలకు ఒకసారి ఫిల్టర్ మార్చాలి. దీనికి సంబంధించిన పుస్తకంలో ఫిల్టర్, మెమ్బ్రేన్‌కి గురించిన సమాచారం ఉంటుంది. నీటి నుంచి వచ్చే కాలుష్య కారకాలు ఫిల్టర్ ఉపరితలంపై జమ అవుతాయి కాబట్టి RO వాటర్ ప్యూరిఫైయర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం అవసరం. కాలక్రమేణా ఈ కలుషితాలు ఫిల్టర్‌ను నిరోధిస్తాయి. వడపోత సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. నీటి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో ప్యూరిఫైయర్ పాడైపోతుంది

RO వాటర్ ప్యూరిఫైయర్‌లలో రెండు ప్రధాన రకాల ఫిల్టర్‌లు ఉన్నాయి: సెడిమెంట్ ఫిల్టర్‌లు, కార్బన్ ఫిల్టర్‌లు. సెడిమెంట్‌ ఫిల్టర్లు నీటి నుంచి పెద్ద కణాలను తొలగిస్తాయి అయితే కార్బన్ ఫిల్టర్లు క్లోరిన్, ఇతర ప్రమాదకరమైన కాలుష్య కారకాలను తొలగిస్తాయి. వాటర్ ప్యూరిఫైయర్ స్వచ్ఛమైన నీటిని అందించడానికి రూపొందించారు. అయితే, కాలక్రమేణా కలుషితాలు అవశేషాలు, పైపులు ట్యాంక్‌లో పేరుకుపోతాయి. ఇది నీటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది కాబట్టి సమయానికి శుభ్రపరచడం అవసరం.

Tags:    

Similar News