Dark Web: డార్క్ వెబ్ అంటే ఏమిటి.. దీనికి ఎందుకు దూరంగా ఉండాలి..?

Dark Web: కొన్నిసార్లు మనం వార్తలు చదివేటప్పుడు డార్క్‌ వెబ్‌ అనే పదం కనిపిస్తుంది.

Update: 2023-09-29 13:30 GMT

Dark Web: డార్క్ వెబ్ అంటే ఏమిటి.. దీనికి ఎందుకు దూరంగా ఉండాలి..?

Dark Web: కొన్నిసార్లు మనం వార్తలు చదివేటప్పుడు డార్క్‌ వెబ్‌ అనే పదం కనిపిస్తుంది. ఇది తరచుగా వినిపించే ఇంటర్‌నెట్‌కి సంబంధించిన ఒక వర్డ్‌. కానీ డార్క్‌ వెబ్‌ అంటే ఏమిటీ.. దీనికి ఎందుకు దూరంగా ఉండాలనేది చాలా మందికి తెలియదు. ఇది మీరు పబ్లిక్‌గా చూడలేని ఇంటర్నెట్‌లో కనిపించే ఒక భాగం. ఇందులో వివిధ రకాల కార్యకలాపాలు, కంటెంట్ దాగి ఉంటుంది. సాధారణ వెబ్ బ్రౌజింగ్‌కు కనిపించని వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి డార్క్ వెబ్‌ని యాక్సెస్ చేయవచ్చు.

తప్పుడు పనులు

డార్క్ వెబ్‌లో కరెన్సీ మార్పిడి, క్రిప్టోకరెన్సీ కొనుగోళ్లు, సీక్రెట్‌ కమ్యూనికేషన్‌ వంటి చట్టవిరుద్దమైన పనులకు ఉపయోగిస్తారు. అలాగే డ్రగ్స్‌, హ్యాకింగ్ సేవలు, దొంగిలించిన డేటా, కొన్ని రకాల మెటీరియల్స్‌ను విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. డార్క్ వెబ్‌లో బ్రౌజింగ్ చేయడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. సాధారణ వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి చేయడం సాధ్యం కాదు.

డార్క్ వెబ్‌కు దూరంగా ఉండాలి..?

డార్క్ వెబ్‌కు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెటుతుంది. డార్క్ వెబ్‌లో డ్రగ్స్, హ్యాకింగ్ సేవలు, దొంగతనం, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతాయి. ఇవి మిమ్మల్ని చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెటుతాయి. అందుకే దూరంగా ఉండటం మంచిది.

డార్క్ వెబ్‌లో మీరు సైబర్ బెదిరింపులకు గురవుతారు. వ్యక్తిగత సమాచారం, గుర్తింపు, ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం కష్టంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు డార్క్ వెబ్‌లో ఫిషింగ్, మాల్వేర్, ఇతర సైబర్ దాడులకు గురవుతారు. డార్క్ వెబ్‌లోని అనైతిక కంటెంట్, కార్యకలాపాలు మీ నైతిక విలువలకు విరుద్ధంగా ఉంటాయి. ఈ కారణాల వల్ల డార్క్ వెబ్‌కు దూరంగా ఉండాలి.

Tags:    

Similar News