Waterproof Smartwatches: వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్‌లు.. ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌తో పాటు స్విమ్మింగ్‌ చేసేవారికి సూపర్..!

Waterproof Smartwatches: నేటి టెక్నాలజీ యుగంలో ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోం ది. యూత్‌ వీటివైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

Update: 2024-05-21 06:45 GMT

Waterproof Smartwatches: వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్‌లు.. ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌తో పాటు స్విమ్మింగ్‌ చేసేవారికి సూపర్..!

Waterproof Smartwatches: నేటి టెక్నాలజీ యుగంలో ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోం ది. యూత్‌ వీటివైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇవి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడుతున్నా యి.దీంతో పలు కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ వాచ్‌లను విడుదల చేస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లో వాటర్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ వాచ్‌లు సందడి చేస్తున్నాయి. నీటి అడుగునా మీ ఫిట్ నెస్ తో పాటు స్విమ్మింగ్ లక్ష్యాలను ఇవి ట్రాకింగ్ చేస్తాయి. వీటిలో వివిధ బ్రాండ్ల కు చెందిన స్మార్ట్ వాచ్ ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నాయిస్ వీవీడ్ కాల్ 2 స్మార్ట్ వాచ్ (noise vivid call 2 smart watch)

నాయిస్ నుంచి విడుదలైన ఈ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌వాచ్‌ 1.85 అంగుళాల డిస్‌ప్లేతో సూపర్‌గా ఉంది. దీనిని నాయిస్ ఫిట్ ప్రైమ్ యాప్ తో కనెక్ట్ చేయవచ్చు. మీ ఆరోగ్యం, వ్యాయామం రెండింటినీ ఇది పర్యవేక్షిస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏడు రోజులు వస్తుంది. హార్ట్‌బీట్‌ రేటు, ఎస్పీఓ2, నిద్ర, స్ట్రెస్‌ స్థాయిలను ట్రాక్ చేస్తుంది.

ఫైర్-బోల్ట్ నింజా 3 ప్లస్ (Fire-boltt ninja 3 plus)

ఫైర్ బోల్ట్ విడుదల చేసిన ఈ వాచ్ 1.83 అంగుళాల డిస్‌ప్లే, 240*284 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. దీనిలో ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్ కెపాసిటీ ఉంది. ఇన్‌బిల్ట్ గేమ్‌లు,118 స్పోర్ట్స్ మోడ్‌లు, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్, వందకు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు దీని ప్రత్యేకత. ఈతగాళ్ల కోసం స్మార్ట్ హెల్త్ అసిస్టెంట్‌ ఫీచర్ ఉంది.

ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ గ్లైడ్ అడ్వాన్స్‌డ్ (FastTrack limitless)

దీనిని స్విమ్మర్ల కోసం రూపొందించారు. ఇది నిద్ర, ఎస్పీO2 స్థాయిలను ట్రాక్ చేస్తుంది. శ్వాస వ్యాయామాలు, హార్ట్‌బీట్‌ రేట్‌ పరిశీలిస్తాయి. ఈ వాచ్ లో వంద ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, ఏఐ కోచ్, ఆటో మల్టీస్పోర్ట్ రికగ్నిషన్‌ ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏడు రోజుల పాటు పని చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌ను ఉపయోగిస్తే మూడు రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

సీబీరెర్ బియాండ్ 3 స్మార్ట్ వాచ్ (CIBERER BEYOND3)

ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ బ్యాకప్ 14 రోజులు వస్తుంది. 1.43 అంగుళాల హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే కలిగిన ఈ వాచ్ లో కూల్‌, హీట్‌, టెంపరేచర్‌, స్ప్రే, రెయిన్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐపీ69కే, 3 ఏటీఎమ్ రేటింగ్‌తో 30 మీటర్ల వరకు వాటర్ ప్రూఫ్ గా పని చేస్తుంది. హార్ట్ బీట్, ఆక్సిజన్ స్థాయిలు, కేలరీలు, శ్వాస, నిద్ర తదితర వాటిని ట్రాక్ చేస్తుంది. స్విమ్మింగ్, యోగా, సైక్లింగ్ తదితర 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.

Tags:    

Similar News