Vivo Y18i: అస్సలు ఊహించలేదు.. రూ.7,999కే వివో నుంచి కొత్త ఫోన్.. చూసుకో మరి..!
Vivo Y18i: వివోY18i బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీన్ని రూ.7,999కి కొనుగోలు చేయవచ్చు.
Vivo Y18i: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఫుల్ జోష్ మీద ఉంది. వరుసగా బడ్జెట్ సెగ్మెంట్‌లో సరికొత్త ఫోన్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే తన బ్రాండ్ నుంచి Vivo Y18i స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ Unisoc T612 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14లో 4జీబీ ర్యామ్‌తో వస్తుంది. Vivo Y18i ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, దాని ధర మొదలైన వాటి గురించి తెలుసుకుందాం.
Vivo Y18i Price
ధర గురించి మాట్లాడితే Vivo Y18i స్మార్ట్‌ఫోన్ 4GB RAM+64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.7,999 చెల్లించాలి. Vivo అధికారిక వెబ్‌సైట్‌తో సహా ఆఫ్‌లైన్ రిటైలర్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పేస్ బ్లాక్, జెమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
Vivo Y18i Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1612 × 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 528 నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఫోన్ Android 14 ఆధారంగా Funtouch OS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Unisoc T612 ప్రాసెసర్ ఉంది. ఫోన్ 5,000mAh బ్యాటరీతో 15W ఛార్జింగ్‌కు సపోర్ట్. దీనికి IP54 రేటింగ్ ఉంది.
కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో f/2.2 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/3.0 ఎపర్చర్‌తో 0.08 మెగాపిక్సెల్ యాక్సిలరీ కెమెరా ఉంది. ముందు భాగంలో f/2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4G, బ్లూటూత్ 5.0, USB టైప్ C పోర్ట్, FM ఉన్నాయి. సెన్సార్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార్ ఉన్నాయి.