Smartphone Blast: పొరపాటున ఈ తప్పులు చేయకండి.. ఫోన్ బాంబులా పేలుతుంది..!
* స్మార్ట్‌ఫోన్ వాడేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
Smartphone Blast: మీరు చాలాసార్లు మొబైల్ ఫోన్ పేలి గాయపడినట్లు, మరణించినట్లు వార్తలు వినే ఉంటారు. అయితే స్మార్ట్‌ఫోన్ పనిచేయకపోవడం వల్ల బ్లాస్ట్ అయిందా లేదా మరేదైనా కారణం ఉందా అనేది ఎవ్వరికి సరిగ్గా తెలియదు. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్ వాడేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలామంది వీటిని నిర్లక్ష్యంగా వదిలేస్తారు. తగిన మూల్యం చెల్లించుకుంటారు. అందుకే సెల్‌ఫోన్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.
ఓవర్ ఛార్జింగ్:
చాలామంది రాత్రిపూట ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టి నిద్రపోతారు. ఇలా చేయడం పూర్తిగా తప్పు. ఫోన్ ఛార్జ్ అయిన తర్వాత దానిని ప్లగ్ నుంచి తీసివేయాలి. లేదంటే అది వేడెక్కడం ప్రారంభమవుతుంది. ఇలా జరిగితే అది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ ప్లగ్ తీసి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు సురక్షితంగా ఉంటారు.
ఛార్జింగ్ పెట్టి మొబైల్ లో మాట్లాడటం:
మొబైల్‌ని ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటే అది త్వరగా వేడెక్కుతుంది. పేలుడు ప్రమాదం మరింత పెరుగుతుంది. ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడకూడదు. ప్లగ్‌ని తీసివేసి మాట్లాడాలి. ఇది వినడానికి సిల్లీగా అనిపించినా మీ కుటుంబానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్‌ను జేబులో బ్యాగ్‌లో ఉంచుకోవడం:
స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువసేపు జేబులో లేదా బ్యాగ్‌లో ఉంచకూడదు. దీనివల్ల అది వేగంగా వేడెక్కుతుంది. ఇలా చేయడం వల్ల బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది. మీరు ఇంట్లో లేదా ఆఫీసులో వీలైనంత వరకు ఫోన్‌ని ఓపెన్‌లో ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. పేలుడు ప్రమాదం తగ్గుతుంది.
ఫోన్‌ని ఎక్కువసేపు ఎండలో ఉంచవద్దు:
చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ని ఎండలో ఉంచుతారు. సూర్యుని కాంతి దానిపై పడటం వల్ల అది వేగంగా వేడెక్కుతుంది. దీని కారణంగా ఫోన్ బ్యాటరీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాని ప్రాసెసర్ కూడా వేడెక్కుతుంది. ఎండలో ఉంచిన ఫోన్ ఎప్పుడైనా పేలవచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫోన్‌ను నేరుగా ఎండలో ఉంచవద్దు.