Highest Selling Smartphones: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..!

Highest Selling Smartphones: భారత్‌లో చైనా స్మార్ట్‌ఫోన్‌ల శకం ముగియనుంది. IDC నివేదిక ప్రకారం 2023 మూడో త్రైమాసికంలో శామ్‌సంగ్‌, ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఎక్కువగా ఉన్నాయి.

Update: 2023-11-03 13:30 GMT

Highest Selling Smartphones: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..!

Highest Selling Smartphones: భారత్‌లో చైనా స్మార్ట్‌ఫోన్‌ల శకం ముగియనుంది. IDC నివేదిక ప్రకారం 2023 మూడో త్రైమాసికంలో శామ్‌సంగ్‌, ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ వాటా ఈ రెండు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల నియంత్రణలో ఉన్నాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల విక్రయాలు నిరంతరం క్షీణిస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో చైనీస్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడం ఒకటి. దీని ప్రభావం చైనా ఫోన్‌లపై పడింది. ఇది కాకుండా భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు బలంగా మారడం రెండోది. ఈ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌ల ధరలు కూడా చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే తక్కువగా ఉండటం విశేషం.

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ ఆధిపత్యం కొనసాగుతోంది. IDC నివేదిక ప్రకారం, Samsung 2023 మూడో త్రైమాసికంలో 19.7% మార్కెట్ వాటాను సాధించింది. అయితే గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే శాంసంగ్ మార్కెట్ షేర్ 8.4% క్షీణించింది. శాంసంగ్ తర్వాత యాపిల్ రెండో స్థానంలో ఉంది. ఆపిల్ 17.7% మార్కెట్ వాటాను సాధించింది. ఇది ఇప్పటి వరకు అత్యధిక మార్కెట్ వాటా. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే యాపిల్ మార్కెట్ వాటా 2.5% పెరిగింది.

టాప్ 5 కంపెనీలు

Samsung, Apple తర్వాత, Xiaomi మూడో స్థానంలో ఉంది. దీని మార్కెట్ వాటా 13.7%. గత ఏడాది కాలంలో Xiaomi తన మార్కెట్ వాటాను 2.4% పెంచుకుంది. Oppo నాలుగో స్థానంలో ఉంది. దీని మార్కెట్ వాటా 8.9%. ఒప్పో మార్కెట్ షేర్ వార్షిక ప్రాతిపదికన 6.5% క్షీణించింది. ఐదో స్థానంలో ట్రాన్స్‌షన్ ఉంది దీని మార్కెట్ వాటా 8.6%. Transsion స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు Tecno, Infinix, itel. ట్రాన్స్‌షన్ మార్కెట్ వాటా వార్షిక ప్రాతిపదికన 35% పెరిగింది.

Tags:    

Similar News