GNSS Toll System: ఫాస్ట్‌ట్యాగ్ బాధలకు చెక్.. టోల్ చెల్లింపులు ఇకపై మరింత ఈజీగా.. GNSS వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం..
GNSS Toll System: GNSS అనేది ఉపగ్రహ ఆధారిత యూనిట్. ఇది వాహనాల్లో ఫిక్స్ చేసిన వెంటనే, సిస్టమ్ సహాయంతో, కారు టోల్ హైవేను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు అధికారులు సులభంగా ట్రాక్ చేయగలుగుతారు.
Global Navigation Satellite System: భారతదేశంలోని ఆటో పరిశ్రమలో గడిచిన ప్రతి రోజు ఏదో ఒక కొత్త సంఘటన చోటు చేసుకుంటోంది. దీంతో పాటు టోల్ వసూళ్లలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటి వరకు టోల్ వసూలుకు సంప్రదాయ పద్దతిలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్‌ఎస్‌ఎస్) టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ పరీక్ష దశలోనే ఉందని చెబుతున్నారు. ఇది వచ్చిన తర్వాత, భారతదేశంలో పాత టోల్ టెక్నాలజీని రద్దు చేయవచ్చు.
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటే ఏమిటి?
GNSS నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఇది శాటిలైట్ ఆధారిత యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది వాహనాల్లో అమర్చబడుతుంది. సిస్టమ్ సహాయంతో, కారు టోల్ హైవేను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు అధికారులు సులభంగా ట్రాక్ చేయగలుగుతారు. వాహనం టోల్ రహదారి నుంచి బయలుదేరిన వెంటనే, సిస్టమ్ టోల్ రహదారి వినియోగాన్ని లెక్కించి, మొత్తాన్ని తీసివేస్తుంది.
GNSS వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, దాని సహాయంతో, ప్రయాణీకులు వారు తీసుకున్న ప్రయాణానికి మాత్రమే డబ్బు మాత్రమే చెల్లిస్తారు. దీని సహాయంతో, ప్రయాణీకులు చెల్లించాల్సిన టోల్ మొత్తాన్ని కూడా కనుగొనగలరు. రో మంచి విషయం ఏమిటంటే, ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టిన తర్వాత, సాంప్రదాయ టోల్ బూత్‌లు కూడా తొలగించబడతాయి. అక్కడ కొన్నిసార్లు పొడవైన క్యూలు ఏర్పడతున్న సంగతి తెలిసిందే.
ఈ కొత్త వ్యవస్థ ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతం, ప్రభుత్వం దీనికి సంబంధించి తేదీని ప్రకటించలేదు. అయితే, దీని పరీక్ష దేశంలోని రెండు ప్రధాన రహదారులపై జరుగుతోంది. వీటిలో కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ జాతీయ రహదారి (NH-257), హర్యానాలోని పానిపట్-హిసార్ జాతీయ రహదారి (NH-709) ఉన్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దశలవారీగా అమలు చేయనున్నారు.