AC Care Tips: ఎండాకాలం వచ్చేసింది.. ఏసీలు ఆన్‌చేసేముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

AC Care Tips: ఎండాకాలం వచ్చేసింది ఇక అందరూ ఏసీలకి పనిచెప్పాలని అనుకుంటారు. ఇందుకోసం వాటిని రెడీ చేస్తుంటారు.

Update: 2024-03-22 10:30 GMT

AC Care Tips: ఎండాకాలం వచ్చేసింది.. ఏసీలు ఆన్‌చేసేముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

AC Care Tips: ఎండాకాలం వచ్చేసింది ఇక అందరూ ఏసీలకి పనిచెప్పాలని అనుకుంటారు. ఇందుకోసం వాటిని రెడీ చేస్తుంటారు. అయితే ఏదైనా ఒక వస్తువు కొన్ని రోజులు పనిచేయకుండా పక్కన పెడితే అది దాని సామర్థ్యాన్ని కోల్పోతుంది. అలాగే ఏసీ కూడా కొన్ని రోజులు వాడకుండా ఉన్నప్పుడు దానిని వెంటనే ఆన్‌ చేయకూడదు. దానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చాలా రోజుల తర్వాత ఏసీని ఆన్ చేసే ముందు ఏసీ యూనిట్‌ని పరిశీలించడం అవసరం. ప్రధానంగా ఏమైనా పార్ట్స్‌ విరిగాయోమో చెక్‌ చేయడం ముఖ్యం. ఏసీలోని ఫిల్టర్లు గాలి నాణ్యతను నిర్వహించడంలో, ఏసీని సమర్ధవంతంగా పనిచేసేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాబట్టి ఏసీని ఎక్కువసేపు ఉపయోగించనప్పుడు దుమ్ము, ధూళి మొదలైనవి ఫిల్టర్‌లో కూరుకుపోయి, గాలి ప్రవాహాన్ని అడ్డుకుని, ఏసీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఏసీ ఫిల్టర్‌ని సరిచూసుకుని దాని స్థానంలో కొత్తది పెట్టుకోవడం ఉత్తమం.

ఏసీ కూలింగ్‌ మోడ్‌, టెంపరేచర్‌ సెట్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. అవసరమైతే థర్మోస్టాట్ బ్యాటరీలను మార్చడం మంచిది. ఏసీ ఆన్ చేసిన వెంటనే వేడిని తగ్గించవద్దు. క్రమంగా తగ్గించాలి. ఇది ఏసీ సిస్టమ్‌పై అనవసరమైన ఒత్తిడిని నివారిస్తుంది. ఏసీ ఆన్ చేసిన తర్వాత యూనిట్ నుంచి ఏవైనా శబ్దాలు, కంపనాలు, వాసనలు వస్తున్నాయో లేదో గమనించాలి. మీ దృష్టికి ఏవైనా సమస్యలు వస్తే వాటిని ఏసీ మెకానిక్ ద్వారా రిపేర్ చేయించాలి.

Tags:    

Similar News