Upcoming Smart Phones: డిసెంబర్‌లో వచ్చేస్తున్నాయి కూల్‌ స్మార్ట్‌ఫోన్లు.. వన్‌ప్లస్ నుంచి రియల్‌మీ వరకు..!

Upcoming Smart Phones: స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్‌ చేస్తుంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. ఈ నెలలో అనేక కొత్త ఫోన్లు విడుదలవుతున్నాయి.

Update: 2023-12-03 15:00 GMT

Upcoming Smart Phones: డిసెంబర్‌లో వచ్చేస్తున్నాయి కూల్‌ స్మార్ట్‌ఫోన్లు.. వన్‌ప్లస్ నుంచి రియల్‌మీ వరకు..!

Upcoming Smart Phones: స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్‌ చేస్తుంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. ఈ నెలలో అనేక కొత్త ఫోన్లు విడుదలవుతున్నాయి. కొంచెం వేచి ఉంటే మంచి మోడల్‌ లభిస్తుంది. OnePlus కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 12 ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఇది కాకుండా IQ 11 అప్‌గ్రేడ్ మోడల్ కూడా రాబోతోంది. ఏ మోడల్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

OnePlus 12 5G లాంచ్ తేదీ

వన్‌ప్లస్ ఫోన్ డిసెంబర్ 5న వినియోగదారుల కోసం చైనీస్ మార్కెట్‌లో విడుదల అవుతుంది. టిప్‌స్టర్ మ్యాక్స్ జాంబోర్ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ వచ్చే ఏడాది జనవరి 23న భారత మార్కెట్లో విడుదల కానుంది. ధర గురించి మాట్లాడితే OnePlus 11 5G కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

iQOO 12 5G లాంచ్ తేదీ

IQ 11 అప్‌గ్రేడ్ మోడల్ డిసెంబర్ 12న భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ డివైజ్‌ని Qualcomm కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్, 8 జనరేషన్ 3 చిప్‌సెట్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్‌తో అందించవచ్చు. అధికారిక లాంచ్ తర్వాత అమెజాన్‌లో అమ్మకానికి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ధర 60 వేల కంటే ఎక్కువగా ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు.

Realme GT 5 Pro లాంచ్ తేదీ

Realme కంపెనీ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 7 న చైనీస్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ హ్యాండ్‌సెట్‌ను భారత మార్కెట్లో కస్టమర్ల కోసం ఎప్పుడు లాంచ్ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. రూ.50 వేల నుంచి రూ.60 వేల ధరతో వచ్చే ఏడాది నాటికి ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల కావచ్చని అంచనా.

Tags:    

Similar News