SIM Card Hacked: సిమ్‌ కార్డ్‌ని ఈ విధంగా హ్యాక్‌ చేస్తున్నారు.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..!

SIM Card Hacked: ఇటీవల సిమ్‌కార్డ్‌ మోసాలు అధికంగా జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది మోసపోతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు.

Update: 2024-01-29 15:30 GMT

SIM Card Hacked: సిమ్‌ కార్డ్‌ని ఈ విధంగా హ్యాక్‌ చేస్తున్నారు.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..!

SIM Card Hacked: ఇటీవల సిమ్‌కార్డ్‌ మోసాలు అధికంగా జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది మోసపోతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు. మీరు వాడే సిమ్‌నే సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసి బ్యాంక్‌ అకౌంట్‌లో ఉండే మొత్తం దోచేస్తున్నారు. అయితే సైబర్ దుండగులు డూప్లికేట్ సిమ్‌లను ఎలా పొందుతారనే దానిపై అవగాహన ఉండాలి. దీనివల్ల సిమ్‌కార్డ్ మోసాలను నివారించవచ్చు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

సిమ్‌ స్వాప్ మోసం

హ్యాకర్లకు ఇది అత్యంత సులువైన పద్దతి. ఇందులో హ్యాకర్లు మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ వంటి సమాచారాన్ని సేకరిస్తారు. తర్వాత మీ మొబైల్ ఆపరేటర్‌ని సంప్రదించి కొత్త సిమ్‌ కార్డ్‌ జారీ చేయమని అడుగుతారు. వారు కొత్త సిమ్‌ కార్డ్‌ పొందిన తర్వాత దానిని ఫోన్‌లోకి జొప్పించి ఫోన్ నంబర్‌ను, అన్ని సంబంధిత సేవలను నియంత్రించడం ప్రారంభిస్తారు.

సోషల్ ఇంజనీరింగ్

ఈ పద్ధతిలో హ్యాకర్లు మీతో పరస్పరం మాట్లాడుతూ మీ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. మీ నమ్మేవిధంగా తమను తాము ప్రభుత్వ అధికారులు లేదా బ్యాంకు ఉద్యోగులుగా చెప్పుకుంటారు. మీ నుంచి అవసరమైన సమాచారాన్ని పొందిన తర్వాత మీ సిమ్ కార్డ్‌ని హ్యాక్ చేస్తారు.

సాఫ్ట్‌వేర్ హ్యాకింగ్

ఈ పద్ధతిలో హ్యాకర్లు మీ ఫోన్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సిమ్ కార్డ్‌ని హ్యాక్ చేస్తారు. తరచుగా మీ ఫోన్‌లోకి ప్రవేశించి మీ డేటాను దొంగిలించే మాల్వేర్ లేదా స్పైవేర్‌లను ఉపయోగిస్తారు.

సిమ్‌ కార్డ్ హ్యాకింగ్‌ను నివారించడానికి చిట్కాలు

మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మే వ్యక్తులతో మాత్రమే మీ పర్సనల్‌ విషయాలను షేర్‌ చేసుకోవాలి. మీ మొబైల్ ఆపరేటర్‌కు మీ గురించి తరచుగా అప్‌డేట్ ఇస్తూ ఉండాలి. చిరునామా, పుట్టిన తేదీ వంటివి అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. ఫోన్‌లో బలమైన పాస్‌వర్డ్ మెయింటెన్‌ చేయాలి. క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తూ ఉండాలి.

సిమ్‌కార్డ్ హ్యాక్ అయితే ఏమి చేయాలి?

మీ సిమ్‌కార్డ్ హ్యాక్ అయితే వెంటనే మొబైల్ ఆపరేటర్‌ని సంప్రదించాలి. మీ సిమ్‌కార్డ్ హ్యాక్ అయిందని వారికి తెలియజేయాలి. వారు సిమ్‌కార్డ్‌ని బ్లాక్ చేస కొత్త సిమ్‌కార్డ్‌ని జారీ చేస్తారు. అదనంగ బ్యాంక్, ఇతర ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలి.

Tags:    

Similar News