Redmi Smart Fire TV: రెడ్‌మి నుంచి 4K స్మార్ట్ టీవీ.. ధర, ఫీచర్లు అద్భుతం..!

Redmi Smart Fire TV: పండుగ ముందర పలు ఎలక్ట్రానిక్‌ కంపనీలు గృహోపకరణాలపై ఆఫర్లు ప్రకటించడం ప్రారంభించాయి.

Update: 2023-10-01 16:00 GMT

Redmi Smart Fire TV: రెడ్‌మి నుంచి 4K స్మార్ట్ టీవీ.. ధర, ఫీచర్లు అద్భుతం..!

Redmi Smart Fire TV: పండుగ ముందర పలు ఎలక్ట్రానిక్‌ కంపనీలు గృహోపకరణాలపై ఆఫర్లు ప్రకటించడం ప్రారంభించాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, ఏసీలపై డిస్కౌంట్లు ఉన్నాయి. తాజాగా షియోమి Redmi Smart Fire TV 4K SmartTVని ప్రారంభించింది. కస్టమర్లు దీనిని అమెజాన్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని ఫీచర్లు, ప్రత్యేకతల గురించి ఈ రోజుతెలుసుకుందాం.

భారతదేశంలో Redmi Smart Fire TV 4K ధర

భారతదేశంలో Redmi Smart Fire TV 4K టీవీ ధర రూ. 26,999గా ఉంది కానీ ప్రత్యేక లాంచ్ ప్రమోషన్‌లో భాగంగా రూ. 24,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు Mi.com, Amazon ద్వారా కొనుగోలు చేయవచ్చు .ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు, EMI లావాదేవీలను ఎంచుకునే వారికి ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. వీటికింద రూ. 1,500 తగ్గింపును పొందవచ్చు.

Redmi Smart Fire TV 4K ఫీచర్లు

Redmi Smart Fire TV 4K, 43 అంగుళాల 4K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 3,840 x 2,160 పిక్సెల్‌ల రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది HDRకి సపోర్ట్ చేస్తుంది. మెరుగైన చిత్ర నాణ్యత కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది డాల్బీ ఆడియో, DTS వర్చువల్:X, DTS:HDకి సపోర్ట్ చేసే 24W డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది.

Redmi Smart Fire TV 4K 64 బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2GB RAM, 8GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇది FireOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఆరు యూజర్ ప్రొఫైల్‌లు, 12,000 యాప్‌లు, ఇన్‌బిల్ట్‌ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, పేరెంటల్ కంట్రోల్స్, పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను అందిస్తుంది. Redmi Smart Fire TV 4Kలో స్క్రీన్ మిర్రరింగ్, ఆటో-తక్కువ లేటెన్సీ మోడ్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, మూడు HDMI 2.1 పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి.

Tags:    

Similar News