Redmi A5: బడ్జెట్‌లో బాహుబలి! రెడ్‌మీ ఏ5 వచ్చేసింది.. ఫీచర్లు కేక!
తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. షియోమీ తన రెడ్‌మీ సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ ఏ5 (Redmi A5) పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఫోన్ ధర తక్కువగా ఉన్నప్పటికీ, ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.

Redmi A5: బడ్జెట్‌లో బాహుబలి! రెడ్‌మీ ఏ5 వచ్చేసింది.. ఫీచర్లు కేక!
Redmi A5: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. షియోమీ తన రెడ్‌మీ సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ ఏ5 (Redmi A5) పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఫోన్ ధర తక్కువగా ఉన్నప్పటికీ, ఫీచర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.
రెడ్‌మీ ఏ5 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌తో పనిచేస్తుంది. ఇది 4జీ నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. ఈ ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ రిజల్యూషన్‌తో కూడిన LCD డిస్‌ప్లేను అందించారు. విశేషం ఏంటంటే, ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్ వల్ల ఫోన్ డిస్‌ప్లేపై పిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది. సాధారణంగా ఈ రిఫ్రెష్ రేట్‌ను మధ్య తరహా ఫోన్లలోనే చూస్తుంటాం, కానీ బడ్జెట్ ధరలో ఇది లభించడం నిజంగా గొప్ప విషయం.
ఇంకా ఈ ఫోన్ ఆక్టాకోర్ టీ7250 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB RAMతో వస్తుంది. వర్చువల్‌గా మరో 4GB వరకు ర్యామ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ వేగంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. వెనుకవైపు 32MP కెమెరా మరియు ముందువైపు 8MP కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ కోసం వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ , 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ ఏ5 పాండిచేరి బ్లూ, జస్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌కు స్మడ్జ్ రెసిస్టెంట్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల దీనిపై ఫింగర్ ప్రింట్ అంత సులభంగా పడవు. అలాగే, 3GB RAM + 64GB స్టోరేజ్, 4GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ విడుదలైంది. మెమొరీని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. డ్యూయల్ సిమ్‌లతో పాటు మైక్రో SD కార్డ్ కోసం ప్రత్యేక స్లాట్‌లు ఉన్నాయి. రెడ్‌మీ ఏ5లో FM రేడియో కూడా ఉంది.
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,499 కాగా, 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ అమ్మకాలు ఏప్రిల్ 16 నుండి షావోమీ, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లలో ప్రారంభమయ్యాయి.