Portable AC: తక్కువ ధరలో పోర్టబుల్ ఏసీ.. ఎండాకాలం వేడిని తరిమేయండి..!
Portable AC: ఎండలు ముదురుతుండడంతో అందరూ చల్లదనం కోసం వెతుకుతుంటారు.
Portable AC: ఎండలు ముదురుతుండడంతో అందరూ చల్లదనం కోసం వెతుకుతుంటారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు పనిచెబుతూ ఉంటారు. కానీ పెరిగిన ఎండలకు ఫ్యాన్ల గాలి సరిపోదు పైగా నిరంతరం నడుస్తూ ఉంటే గాలి వేడిగా వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది కూలర్లపై ఆధారపడుతారు. మరికొంత మంది ఏసీలు కొనుగోలు చేస్తారు. అయితే అయితే మిడిల్ క్లాస్ వ్యక్తులు గోడ ఏసీ కొనాలంటే కొంచెం ఆలోచిస్తారు. అలాంటివారి కోసం పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లోకి వచ్చేశాయ్. వీటిని మీరెక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్ రూమ్, పిక్నిక్.. స్టడీ రూమ్.. ఇలా ఎక్కడైనా పెట్టొచ్చు. వాటి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఏసీ అమ్మకానికి అందుబాటులో ఉంది. నిజానికి దీని ధర రూ. 2,999 కానీ 40 శాతం తగ్గింపుతో రూ.1,799కి లభిస్తోంది. దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ.88 కడితే చాలు మినీ ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీలోని కూలింగ్ ఫ్యాన్ స్పీడ్‌ను మూడు మోడ్స్‌లో అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ కూలర్ బరువు చాలా తక్కువ. అలాగే ఇందులోని వాటర్ ట్యాంక్‌లో ఒకసారి నీళ్లు నింపితే దాదాపుగా 4-5 గంటల వరకు ఉపయోగించవచ్చు. దీని నుంచి వచ్చే చల్లదనంతో రాత్రి హ్యాపీగా నిద్రపోవచ్చు.
అయితే దీనిని కొనుగోలు చేసేముందు కస్టమర్లు అన్ని విషయాలు తెలుసుకొని తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇటీవల ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనం ఆర్డర్ ఒకటి చేస్తే వస్తువు మరొకటి వస్తుంది. అలాగే కొన్నింటిలో ఫీచర్స్ చెప్పిన విధంగా ఉండడం లేదు. ఆన్‌లైన్‌లో చేసినప్పుడు బాగానే ఉంటున్నాయి. కానీ ఆర్డర్ ఇంటికి వచ్చాక తేడాగా ఉంటున్నాయి. అందుకే అన్ని విషయాలు పరిశీలించాకే తీసుకోవడం ఉత్తమం.