Flight Mode: విమాన ప్రయాణంలో ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో ఉండాలి.. లేదంటే ఏం జరుగుతుందంటే..?
Flight Mode: విమానంలో ప్రయాణించేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి.
Flight Mode: విమానంలో ప్రయాణించేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. లేదంటే సిబ్బంది ఊరుకోరు.ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే కచ్చితంగా ప్రయాణీకులందరూ తమ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి లేదా స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది 2 గంటలైనా లేదా 2 రోజులైనా అలాగే ఉండాలి. అందుకే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఉంటుంది. అయితే స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో ఉన్నప్పుడు ప్రయాణికులు ఎటువంటి కాల్స్, మెస్సేజ్ చేయలేరు. అంతేకాదు ఇంటర్నెట్‌ను కూడా ఉపయోగించలేరు. దీని వెనుక ఉన్న కారణం గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
విమాన ప్రయణంలో స్మార్ట్‌ఫోన్‌ని ఫ్లైట్ మోడ్‌లో ఉంచడానికి గల కారణం చాలామందికి తెలియదు. అయితే స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచకపోతే విమానం నావిగేషన్‌లో సమస్యలు ఏర్పడుతాయి. ఈ విషయం మీకు చిన్నదిగా అనిపించవచ్చు కానీ దీని కారణంగా విమానం చాలా భయంకరమైన ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచినప్పుడు సెల్యులార్ నెట్‌వర్క్ ద్వారా విమానం నావిగేషన్ ఏ విధంగానూ ప్రభావితం కాదు.
ఒకవేళ అకస్మాత్తుగా ఫోన్‌ను ఫ్లైట్ మోడ్ నుంచి తీసివేస్తే సెల్యులార్ నెట్‌వర్క్ యాక్టివేట్ అవుతుంది. దీని కారణంగా విమానం నావిగేషన్ దెబ్బతింటుంది. వాస్తవానికి నావిగేషన్ అనేది విమానానికి దారి చూపుతుంది. స్మార్ట్‌ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో ఉండకపోతే అది సరైన మార్గాన్ని చూపకపోవచ్చు. దీనివల్ల విమానం వేరే ప్రదేశానికి వెళ్లడం లేదంటే ఏదైనా ప్రమాదానికి గురవ్వడం జరుగుతుంది. అందుకే విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కచ్చితంగా ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో ఉండాలి.