OnePlus Open Apex: వారెవ్వా వాటే ఫోన్‌.. ధర అక్షరాల రూ. లక్షన్నర..!

మొదటి నుంచి ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొచ్చిన వన్‌ప్లస్ ఈ మధ్య కాలంలో బడ్జెట్‌ ధరలోనూ ఫోన్‌లను తీసుకొచ్చింది. అయితే తాజాగా మరో ప్రీమియం ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Update: 2024-08-09 09:05 GMT

OnePlus Open Apex: వారెవ్వా వాటే ఫోన్‌.. ధర అక్షరాల రూ. లక్షన్నర..!

OnePlus Open Apex: ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే బ్రాండ్స్‌ యాపిల్, సామ్‌సంగ్‌. అయితే అలాంటి ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ చైనాకు చెందిన కొన్ని కంపెనీలు సైతం ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొస్తున్నాయి. వీటిలో వన్‌ప్లస్ ముందు వరుసలో ఉంటుంది. మొదటి నుంచి ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొచ్చిన వన్‌ప్లస్ ఈ మధ్య కాలంలో బడ్జెట్‌ ధరలోనూ ఫోన్‌లను తీసుకొచ్చింది. అయితే తాజాగా మరో ప్రీమియం ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ ఓపెన్‌ అపెక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వన్‌ప్లస్ ఓపెన్‌ అపెక్స్‌ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఫోన్‌ను గతేడాదిలోనే లాంచ్‌ చేయగా తాజాగా.. రేర్‌లో ఫినిష్ లెదర్ తో ఫ్రెష్ రెడ్ షేడ్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 7.82 ఇంచెస్‌తో కూడిన ఇన్నర్ డస్ ప్లే, 6.31 ఇంచెస్‌తో కూడిన అమోలెడ్ కవర్ స్క్రీన్‌ను అందించారు. ఇక ధర విషయానికొస్తే వన్‌ప్లస్ ఓపెన్‌ ఎక్స్‌ 16 జీబీ ర్యామ్‌, 1 టిగా బైట్ స్టోరేజ్‌ ధర రూ. 1,49,999గా నిర్ణయించారు. అయితే గతేడాది లాంచ్‌ చేసిన వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,39,999 ఉంది.

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో.. హెస్సెల్ బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. ఇందులో 64 మెగాపిక్సెల్స్‌, 48 ఎంపీ, 48 ఎంపీతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 20 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరానును, 32 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాలను ఇచ్చారు.

కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదూ, ఏ-జీపీఎస్, క్యూజడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. యాక్సెలరో మీటర్, గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, ఫ్లిక్ డిటెక్ట్ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం. ఇక సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్‌లను అందించారు. 67 వాట్స్‌ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4805 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 

Tags:    

Similar News