OnePlus Top 3 Deals: ఊరమాస్ అయ్యా.. వన్‌ప్లస్ బెస్ట్ ఫోన్స్ ఇంత తక్కువకు ఎలా ఇస్తారు..!

OnePlus Top 3 Deals: వన్‌ప్లస్ అఫిషియల్ వెబ్‌సైట్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు రూ.20 వేల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-08-18 09:57 GMT

OnePlus Top 3 Deals

OnePlus Top 3 Deals: టెక్ మార్కెట్‌లో OnePlusకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ బ్రాండ్ నుంచి ఏదైనా గ్యాడ్జెజ్ వస్తుందంటే ఫుల్ హైప్ ఉంటుంది. మీరు వన్‌ప్లస్ నుండి కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అఫిషియల్ వెబ్‌సైట్‌లో మీ కోసం అద్భుతమైన ఆఫర్ ఉంది. ఈ బంపర్ డీల్‌లో మీరు రూ.20 వేల వరకు తగ్గింపుతో OnePlus స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లను రూ. 15,000 వరకు జియో ప్లస్ ప్రయోజనాలతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఫోన్లపై బలమైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ అనేది మీ పాత ఫోన్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీ , బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ OnePlus ఫోన్‌లను ఆకర్షణీయమైన EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. కాబట్టి OnePlus వెబ్‌సైట్‌లో లైవ్‌లో టాప్ 3 డీల్స్ గురించి తెలుసుకుందాం.

1. OnePlus 12 (వన్‌ప్లస్ 12)
16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.69,999. కంపెనీ డీల్‌లో రూ.7 వేల వరకు తక్షణ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. Jio Plus పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఉన్న వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 2250 వరకు బెనిఫిట్ పొందవచ్చు. మీరు EMI స్కీమ్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌పై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే,ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌లో పనిచేస్తుంది. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్.

2. OnePlus Nord 4 (వన్‌ప్లస్ నార్ట్ 4)
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.29,999. బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్ రూ. 2,000 వరకు చౌకగా లభిస్తుంది. Jio Plus పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2250 వరకు తగ్గింపు లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను రూ. 2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను, 5500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

3. OnePlus Open (వన్‌ప్లస్ ఓపెన్)
16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్‌లో రూ. 139,999 ధరతో అందుబాటులో ఉంది. ఫోన్‌పై రూ.20 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. జియో ప్లస్ క్క రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌కు మెంబర్షిప్ పొందిన వినియోగదారులు రూ. 15,000 విలువైన ప్రయోజనాలను పొందుతారు. మీరు ఈ ఫోన్‌ని సులభమైన EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పై రూ.8 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. రెండు డిస్‌ప్లేలతో కూడిన ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.

Tags:    

Similar News