Nokia XR21: నోకియా నుంచి వెరీ పవర్ ఫుల్ ఫోన్.. నీళ్లే కాదు, దుమ్ము, అధిక ఉష్ణోగ్రత కూడా ఏం చేయలేవు.. అదిరిపోయే ఫీచర్లు..!
HMD గ్లోబల్ ప్రపంచ మార్కెట్‌లో Nokia XR21 పేరుతో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ Qualcomm Snapdragon 695 చిప్‌సెట్‌తో విడుదలైంది. ఇందులో 64MP ప్రైమరీ కెమెరాను అందించారు. ఇది చాలా ప్రత్యేకమైన ఫోన్.
Nokia XR21: HMD గ్లోబల్ ప్రపంచ మార్కెట్‌లో Nokia XR21 పేరుతో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ Qualcomm Snapdragon 695 చిప్‌సెట్‌తో విడుదలైంది. ఇందులో 64MP ప్రైమరీ కెమెరాను అందించారు. ఇది చాలా ప్రత్యేకమైన ఫోన్. ఎందుకంటే ఇది IP69K రేటింగ్‌ను కలిగి ఉంది. అంటే ఈ ఫోన్‌ను దుమ్ములో కూరుకపోయినా, అధిక ఉష్ణోగ్రత ఉన్నా, నీటిలో పడినా చాలా సురక్షితంగా ఉంటుందంట. నోకియా XR21 ధర, ఫీచర్లను ఓసారి తెలుసుకుందాం..
ఇది పవర్ ఫుల్ ఫోన్. ఇది ఇండోర్, అవుట్‌డోర్‌కు అనువుంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా ఎక్స్‌ఆర్ 30 గా విడుదల చేయాలని గతంలో భావించారు. కానీ, ప్రస్తుతం నోకియా XR21 గా విడుదల చేశారు. ఇది నోకియా XR20కి అప్ గ్రేడ్ వర్షెన్‌లా విడుదల చేసినట్లు చెబుతున్నారు.
నోకియా XR21 ధర..
Nokia XR21 జర్మనీలో EUR 599 (సుమారు రూ. 54,216)కి అందుబాటులో ఉంది. UKలో ఏకైక 6GB + 128GB మోడల్‌కు GBP 499 (సుమారు రూ. 51,267)కి అందుబాటులో ఉంటుంది. సరికొత్త Nokia XR21 ప్రస్తుతం జర్మనీతోపాటు ఎంపిక చేసిన మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఇది జూన్ నుంచి UK లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పైన్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు.
నోకియా XR21 స్పెసిఫికేషన్స్..
డిస్ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.49-అంగుళాల FHD+ 20:9 డిస్‌ప్లే అందించారు.
బ్యాక్ కెమెరా: LED ఫ్లాష్‌తో 64MP, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా అందించారు.
ఫ్రంట్ కెమెరా: 16MP సెల్ఫీ కెమెరా.
చిప్‌సెట్: Qualcomm Snapdragon 695, Adreno 619L GPU చిప్‌సెట్‌తో విడుదలైంది.
ర్యామ్, స్టోరేజ్: 6GB RAM, 128GB స్టోరేజ్.
బ్యాటరీ: 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4800mAh బ్యాటరీ అందించారు.
OS: ఆండ్రాయిడ్ 12.
IP రేటింగ్: IP68/IP69K మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.