వేసవికి ముందే చౌకైన ఏసీ వచ్చేసింది.. తక్కువ విద్యుత్‌ ఎక్కువ చల్లదనం..!

MarQ 4 in 1 Convertible AC: నెల రోజుల్లో శీతాకాలం ముగుస్తుంది.

Update: 2023-02-04 10:30 GMT

వేసవికి ముందే చౌకైన ఏసీ వచ్చేసింది.. తక్కువ విద్యుత్‌ ఎక్కువ చల్లదనం..!

MarQ 4 in 1 Convertible AC: నెల రోజుల్లో శీతాకాలం ముగుస్తుంది. మండే వేసవికాలం ప్రారంభమవుతుంది. అందుకే MarQ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా శక్తివంతమైన 4-in-1 కన్వర్టిబుల్ ఎయిర్ కండీషనర్‌ల కొత్త శ్రేణిని విడుదల చేసింది. ఈ ఎయిర్‌ కండీషనర్ గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇది నిమిషాల వ్యవధిలో ఇంటిని చల్లబరుస్తుంది. MarQ 4-in-1 కన్వర్టబుల్ ఇన్వర్టర్ AC 2023 ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

ఈ కొత్త ఎయిర్ కండీషనర్ 'టర్బో కూల్ మోడ్'తో వస్తుంది. ఇది సాధారణ AC అత్యధిక ఫ్యాన్ సెట్టింగ్ కంటే 19% ఎక్కువ 20 నిమిషాల్లో గదిని చల్లబరుస్తుంది. అంతేకాదు ECO మోడ్ తక్కువ విద్యుత్ వినియోగంతో ఇంటిని చల్లబరుస్తుంది. ఈ కొత్త ఏసీ శ్రేణిలు "ఇన్వర్టర్ టెక్నాలజీ"తో పాటు తాజా BEE STAR రేటింగ్‌తో వస్తున్నాయి. ఇది శీతలకరణి (గ్యాస్) ఫ్లో రేట్‌ను నియంత్రించడానికి, తక్కువ శక్తిని వినియోగించుకోవడానికి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేస్తుంది.

MarQ ఎయిర్ కండీషనర్‌లు పవర్ హెచ్చుతగ్గుల నుంచి రక్షించడానికి అంతర్నిర్మిత స్టెబిలైజర్‌లతో నిర్మితమై ఉంటుంది. కంపెనీ 6 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. 1 టన్ను 3 స్టార్ రేటింగ్ రూ.26,499, 1.5 టన్ను 5 స్టార్ రేటింగ్ రూ.32,999, 0.8 టన్ను 3 స్టార్ రేటింగ్ రూ.25,499, 1.5 టన్ను 3 స్టార్ రేటింగ్ రూ.29,999 ప్రారంభంకానున్నాయి.

Tags:    

Similar News