SBI: SBI కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై త‌క్కువ వ‌డ్డీకే రుణాలు.. ఇంకా చాలా ప్ర‌యోజ‌నాలు..

SBI: మీరు రైతు అయితే, వ్యవసాయం చేయడానికి మీకు డబ్బులు అవసరమైతే మీరు SBI నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు

Update: 2021-10-28 16:15 GMT

SBI కిసాన్ క్రెడిట్ కార్డు (ఫైల్ ఇమేజ్)

SBI: మీరు రైతు అయితే, వ్యవసాయం చేయడానికి మీకు డబ్బులు అవసరమైతే మీరు SBI నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రైతులకు సహాయం చేయడానికి క్రెడిట్ కార్డును అందిస్తుంది. దీని సహాయంతో రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులను తీర్చుకోగ‌ల‌డు. చాలా సులభమైన ప్రక్రియ ద్వారా వారి అవసరాన్ని బట్టి రుణం తీసుకోవచ్చు. ఈ కార్డ్ గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకుందాం.

కార్డ్ ఫీచర్లు, ప్రయోజనాలు: 

1. SBI కిసాన్ క్రెడిట్ ఖాతా రివాల్వింగ్ క్యాష్ క్రెడిట్ ఖాతా లాగా ఉంటుంది.

2. ఖాతాలో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటును పొందుతుంది

3. దీని వ్యవధి 5 ​​సంవత్సరాలు. ప్రతి సంవత్సరం వార్షిక సమీక్ష తర్వాత పరిమితిని ఏటా 10 శాతం పెంచుతారు.

4. 3 లక్షల వరకు తక్షణ రుణం తీసుకునే వారికి 3% వడ్డీ రాయితీ ఉంటుంది.

5. తిరిగి చెల్లించే వ్యవధి పంట వ్యవధి, మార్కెటింగ్ వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.

6. అర్హులైన KCC రుణగ్రహీతలందరికీ రూపే కార్డ్ లభిస్తుంది.

7. 45 రోజులకు కార్డ్ యాక్టివేట్ అవుతుంది. రూ.1 లక్ష ప్రమాద బీమా ఉంటుంది.

ఎవరు కార్డు తీసుకోవచ్చు?

1. అర్హులైన రైతులందరూ, వ్యవసాయం చేసే వ్యక్తిగత లేదా ఉమ్మడి రుణ హోల్డర్లు, SBI నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు.

2. కౌలు రైతులు, లీజు, షేర్ కార్పస్ మొదలైన వారు కూడా SBI కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

3. స్వయం సహాయక బృందాలు (SHGలు) లేదా రైతుల జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా బ్యాంకు నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు.

వడ్డీ రేటు

1. 3 లక్షల వరకు రుణం తీసుకునే వారికి వడ్డీ రేటు 7 శాతం.

2. 3 లక్షలకు పైగా రుణం తీసుకునే రైతుకు వడ్డీ రేటు ఎప్పటికప్పుడు అనుకూలంగా ఉంటుంది.

కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

1. SBI నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయాలి.

2. రైతులు నేరుగా SBI శాఖను సందర్శించి KCC దరఖాస్తు ఫారమ్ కోసం అడగవచ్చు.

3. అవసరమైన వివరాలను నింపి, బ్యాంకులో సమర్పించాలి

4. బ్యాంకు దరఖాస్తును పరిశీలించి, దరఖాస్తుదారుడి వివరాలను ధృవీకరించి, కార్డును కేటాయిస్తుంది.

ఏ పత్రాలు అవసరం?

1. ఇంటి చిరునామా, గుర్తింపు రుజువు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి.

2. వ్యవసాయ భూమి పత్రాలు కూడా అవసరం.

3. దరఖాస్తుదారు అతని/ఆమె ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అందించాలి.

4. కార్డ్ జారీ చేసే బ్యాంక్ సెక్యూరిటీ పోస్ట్ డేటెడ్ చెక్‌ను సమర్పించమని కూడా అడగవచ్చు.

Tags:    

Similar News