LED Bulb: సాధారణ ఎల్‌ఈడీ బల్బ్, స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బ్ మధ్య తేడాలు ఏంటంటే..?
LED Bulb: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎల్‌ఈడీ బల్బులనే వాడుతున్నారు. రకరకాల ఎల్‌ఈడీ బల్బులు మార్కెట్లో లభిస్తున్నాయి.
Regular LED Bulb vs Smart LED Bulb: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎల్‌ఈడీ బల్బులనే వాడుతున్నారు. రకరకాల ఎల్‌ఈడీ బల్బులు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ఇందులో సాధారణ ఎల్‌ఈడీ బల్బులు ఉంటాయి అలాగే స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బులు ఉంటాయి. ఈ రెండు ఉపయోగాల పరంగా వేటికవే ప్రత్యేక లక్షణాలని కలిగి ఉంటాయి. కొంతమంది ఈ రెండింటి మధ్య తేడా తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు మీ ఇంటి అవసరాలకి ఏ బల్బు సరిపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాధారణ ఎల్‌ఈడీ బల్బ్
సాధారణ ఎల్‌ఈడీ బల్బ్ గురించి మాట్లాడితే ఇందులో తెల్లటి కాంతి మాత్రమే ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు లైట్ వెలుతురు బాగా వస్తుంది. రాత్రిపూట చదువుకునేవారికి ఈ బల్బులు ఉత్తమమైనవని చెప్పవచ్చు. సాధారణ ఎల్‌ఈడీ బల్బ్ ధర ₹50 నుంచి మొదలై ₹200 వరకు ఉంటుంది. ఇవి పరిమాణంలో చిన్నవి కానీ చాలా శక్తివంతంగా వెలుగుతాయి.
స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బ్
స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బులు సాధారణ ఎల్‌ఈడీ బల్బుల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ధర గురించి మాట్లాడినట్లయితే సాధారణ ఎల్‌ఈడీ బల్బులతో పోల్ చూస్తే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని అనేక పరిమాణాలలో పొందవచ్చు. ఇష్టమైన ఆకృతిలో ఎంచుకోవచ్చు. స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బు కాంతి సాధారణ ఎల్‌ఈడీ బల్బ్ కంటే తక్కువగా వస్తుంది. స్మార్ట్ LED బల్బ్ కాంతి రంగు రంగులలో ఎంపిక చేసుకోవచ్చు. వీటి ప్రారంభ ధర 300 నుంచి మొదలై ₹ 500 లేదా ₹ 1000 వరకు ఉంటుంది. పార్టీ లేదా పరిసర లైటింగ్ కోసం ఇలాంటి బల్బ్‌లని ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బులు స్పీకర్లతో వస్తాయి. ఈ సందర్భంలో అవి ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఇందులో చాలా ప్రత్యేకతలు కలిసి ఉంటాయి కాబట్టి తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి.