WhatsApp Chat List: వాట్సాప్‌ ద్వారా ఎవరితో ఎక్కువగా చాట్ చేస్తారు.. చిన్న ట్రిక్‌తో జాబితా రెడీ..!

WhatsApp Chat List: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. అందులో వాట్సాప్‌ యాప్‌ కూడా ఉంటుంది.

Update: 2023-08-18 10:01 GMT

WhatsApp Chat List: వాట్సాప్‌ ద్వారా ఎవరితో ఎక్కువగా చాట్ చేస్తారు.. చిన్న ట్రిక్‌తో జాబితా రెడీ..!

WhatsApp Chat List: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. అందులో వాట్సాప్‌ యాప్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా ప్రతిరోజూ కోట్లాది మంది ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు నిత్యం చాట్‌ చేస్తూనే ఉంటారు. ఆఫీసులో లేదా వ్యక్తిగత చర్చలో ప్రతి ఒక్కరిని భాగం చేస్తున్నారు. అయితే మీప్రైవేట్ చాట్‌లలో మీరు ఎవరితో ఎక్కువగా కమ్యూనికేట్ అవుతున్నారో సులభంగా తెలుసుకోవచ్చు. అతి ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.

ఉదయం మేల్కోగానే వాట్సాప్ మెసేజ్‌లతో నిండిపోతుంది. కొందరైతే గుడ్ మార్నింగ్ మెసేజ్ లు పంపితే మరికొందరు ఆఫీసు మెస్సేజ్‌లు పంపుతారు. ఇందులో ప్రియారిటీ ప్రకారం మీరు సమాధానం ఇస్తారు. ఇలా రాత్రి వరకు ఎవరితో ఒకరితో వాట్సాప్‌లో మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఈ పరిస్థితిలో మీరు వాట్సాప్‌లో ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో మీకే గుర్తుండదు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో కూడా తెలియదు. అందుకే ఈ ట్రిక్‌ ద్వారా పూర్తి జాబితా మీ కళ్ల ముందు ఉంటుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. ఎలాంటి థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయనవసరం లేదు. కొన్ని సాధారణ స్టెప్స్‌ని ఫాలో అవడం ద్వారా WhatsAppలో ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చు.

ముందుగా WhatsApp ఓపెన్ చేసిన తర్వాత పైన కుడి కార్నర్‌లో కనిపించే మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్‌పై నొక్కాలి. అక్కడ 'డేటా అండ్‌ స్టోరేజ్‌ యూసేజ్‌' ఆప్షన్‌ని చూస్తారు. దానిపై నొక్కాలి. తరువాత మరొక జాబితా కనిపిస్తుంది. అందులో స్టోరేజ్‌ ఆప్షన్‌ ఉంటుంది. దానిపై నొక్కాలి. వెంటనే వాట్సాప్‌లో ఏ యూజర్ ఎంత స్టోరేజ్ స్పేస్‌ను ఉపయోగించారు అనే లిస్టు మీ ముందు కనిపిస్తుంది. పైన మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తి పేరు కనిపిస్తుంది.

జాబితాలోని ఏదైనా పేరుపై క్లిక్ చేస్తే రెండు వైపులా ఎన్ని టెక్స్ట్ మెస్సేజ్‌లు, ఫోటోలు, వీడియోలు షేర్‌ చేశారో స్పష్టంగా చూడవచ్చు . కావాలంటే డేటాను క్లియర్ చేసి స్టోరేజ్‌ పెంచుకోవచ్చు. ఇందుకోసం WhatsApp సెట్టింగ్‌లలో కొన్ని ఆప్షన్స్‌ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రక్రియ తర్వాత మీకు చాలా స్టోరేజ్‌ అందుబాటులో ఉంటుంది. ఫోన్ హ్యాంగింగ్ సమస్య కూడా పోతుంది.

Tags:    

Similar News