ఈ సీలింగ్ ఫ్యాన్‌తో కరెంట్ బిల్ నిల్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Kent kuhl Fan: మీరు కరెంట్ బిల్ తగ్గించాలని చూస్తున్నట్లయితే కెంట్ ఆర్వో సిస్టమ్స్ ఎనర్జీ సేవింగ్ సీలింగ్ ఫ్యాన్‌లను లాంచ్ చేసింది.
Kent kuhl Fan: మీరు కరెంట్ బిల్ తగ్గించాలని చూస్తున్నట్లయితే కెంట్ ఆర్వో సిస్టమ్స్ ఎనర్జీ సేవింగ్ సీలింగ్ ఫ్యాన్‌లను లాంచ్ చేసింది. కుహ్ల్ బ్రాండ్ పేరుతో సీలింగ్ ఫ్యాన్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ సరికొత్త ఫ్యాన్ BLDC టెక్నాలజీతో విడుదలైంది. ఇది తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఈ టెక్నాలజీతో కూడిన ఫ్యాన్ల వల్ల 65 శాతం విద్యుత్ ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. భారత్‌లో తక్కువ విద్యుత్తు వినియోగించే లైట్లు, ఏసీ, ఫ్రిజ్ వంటి వాటిపై విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి సీలింగ్ ఫ్యాన్ కూడా చేరిపోయింది.
కంపెనీ ప్రకారం సీలింగ్ ఫ్యాన్‌లను ఉపయోగించే 90 శాతం ఇళ్లలో కేవలం 3 శాతం మంది మాత్రమే ఇలాంటి ఫ్యాన్‌లను కలిగి ఉన్నారు. కుహ్ల్ పేరుతో విడుదలైన ఈ ఫ్యాన్ 4, 6, 8 బ్లేడ్ ఎంపికలతో వస్తాయి. ఈ ఫ్యాన్‌లు గొప్ప ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలయ్యాయి. BLDC టెక్నాలజీతో పాటు అనేక ఫీచర్లను జోడించారు. ఈ ఫ్యాన్లు Wi-Fi, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రారంభించారు. ఈ ఫ్యాన్‌లను స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. ఇది కాకుండా వాయిస్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు.
రివర్స్ ఫంక్షన్ కారణంగా గదిలోకి వేడి గాలి కూడా వస్తుంది. ఈ ఫ్యాన్‌లు తక్కువ శబ్దం చేస్తూ మంచి గాలిని ఉత్పత్తి చేసే విధంగా రూపొందించారు. BLDC టెక్నాలజీ 65% కంటే తక్కువ శక్తిని వినియోగిస్తుంది. కాబట్టి పవర్ సేవింగ్ టెన్షన్ తొలగిపోతుంది. ఈ ఫ్యాన్లకి వినియోగదారులు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. దేశంలోని 120 కోట్ల డొమెస్టిక్ ఫ్యాన్స్‌లో బీఎల్‌డీసీ టెక్నాలజీని ఉపయోగిస్తే ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని కంపెనీ పేర్కొంది.