IPhone 4S: రూ.75 కోట్లతో ఐఫోన్ 4S.. మొబైల్‌పై మొత్తం 500 వజ్రాలు
IPhone 4S: బంగారు పూత పూసిన లోగోపై 53 వజ్రాలు
IPhone 4S: ఐఫోన్ అంటేనే ఓ ప్రత్యేకత. ఆ బ్రాండ్ అంటే ఇష్టపడని వారుండరు. ఖరీదైన ఈ ఫోన్ కొంటే డైమండ్ దొరికినంత సంబుర పడతారు. అలాంటి యాపిల్ ఫోన్‌కు వజ్రాలు తోడైతే.. ఎంత ముచ్చటగా ఉంటుంది. అలాంటి ఓ మోడల్‌నే తీసుకొచ్చింది యాపిల్ కంపెనీ. 24 క్యారెట్ గోల్డెన్ కోటింగ్‌తో ఫోన్ తయారు చేసి.. దానిపై వజ్రాలను పొదిగారు. మొత్తం 5 వందల వజ్రాలు ఉపయోగించగా.. అందులో లోగోపైనే 53 వజ్రాలు పొందుపరిచారు. మెయిన్ నేవిగేషన్ ను 8.6 క్యారెట్ వజ్రంతో మలిచారు. ఈ ఫోన్‌ను భద్రపరిచేందుకు డైనోసర్ ఎముకతో తయారుచేసిన బాక్స్ కూడా తీర్చిదిద్దారు. 4S ఎలైట్ పేరుతో లాంఛ్ చేసిన ఈ మొబైల్ ఖరీదు 75 కోట్ల రూపాయలు.