Instagram: యూజర్లకు ట్రబులిచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. ఖాతాలు సస్పెండ్ అయినట్టు..
Instagram: మెటా సంస్థకు చెందిన ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Instagram: మెటా సంస్థకు చెందిన ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ ఖాతాలు పని చేయడం లేదంటూ పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇన్‌స్టా ఖాతాలు సస్పెండ్ అయ్యాయని చూపుతున్నట్టు మరికొందరు స్క్రీన్‌షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొబైల్ యాప్‌లోనే కాకుండా వెబ్ వెర్షన్‌లోనూ ఇదే సమస్య నెలకొందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్య ఎక్కువగా ఐఫోన్ వినియోగదారులకు ఎదురైనట్టు తెలుస్తోంది. కొందరు వినియోగదారులు లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు డౌన్‌డిటెక్టర్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా యాజమాన్యం స్పందించింది. ఖాతాలను యాక్సెస్ చేయడంలో కొందరు వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తుననట్టు వెల్లడించింది. సేవల్లో కలిగిన అంతరాయానికి క్షమాపణలు చెప్పింది.