Infinix Smart 8 HD: ఇన్ఫినిక్స్ నుంచి సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌.. ధర కేవలం రూ.7 వేల లోపే..!

Infinix Smart 8 HD: Infinix తన కొత్త ఫోన్ Smart 8 HDని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 అంగుళాల HD + డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 3GB వరకు RAM, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

Update: 2023-12-09 13:00 GMT

Infinix Smart 8 HD: ఇన్ఫినిక్స్ నుంచి సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌.. ధర కేవలం రూ.7 వేల లోపే..!

Infinix Smart 8 HD: Infinix తన కొత్త ఫోన్ Smart 8 HDని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 అంగుళాల HD + డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 3GB వరకు RAM, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది నాలుగు విభిన్న రంగులలో లభిస్తుంది. ఇది కాకుండా ఆపిల్ ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ వంటి మ్యాజిక్ రింగ్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. Infinix Smart 8 HD ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Infinix Smart 8 HD ధర

Infinix Smart 8 HD.. 3 GB RAM, 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,299. అయితే మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మీకు 10% తగ్గింపు లభిస్తుంది. ఈ విధంగా స్మార్ట్‌ఫోన్ ధర రూ. 5,699 అవుతుంది. ఫోన్ మొదటి సేల్ డిసెంబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది.

Infinix Smart 8 HD స్పెసిఫికేషన్‌లు

Infinix Smart 8 HD.. మాలి G57 GPUతో UniSOC T606 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఇది 3GB RAM, 32GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు.

Infinix Smart 8 HD 6.6-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, గరిష్ట ప్రకాశాన్ని500 నిట్‌ల వరకు అందిస్తుంది. డిస్‌ప్లే వేగంగార, స్మూత్‌గా ఉండటంతో చూడటానికి స్టైలిష్‌గా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 13MP ప్రైమరీ సెన్సార్, AI సెన్సార్‌తో డ్యూయల్-రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. దీని కెమెరా సాధారణ ఫోటోగ్రఫీకి సెట్‌ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా కూడాఉంటుంది. ఇది పంచ్ హోల్ లోపల ఉంటుంది.

డైనమిక్ ఐలాండ్ మ్యాజిక్ రింగ్

ఆపిల్ డైనమిక్ ఐలాండ్ నుంచి ప్రేరణ పొందిన మ్యాజిక్ రింగ్ ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లో ఉంది. ఈ ఫీచర్ మీరు ఉపయోగిస్తున్న యాప్‌ని బట్టి డిస్‌ప్లే దిగువన రింగ్‌ని సృష్టిస్తుంది. ఈ ఫీచర్ యాప్‌లను త్వరగా కనుగొనడంలో వినియోగదారులకు సహాయపడుతుంది.

Infinix Smart 8 HD ఫీచర్లు

Infinix Smart 8 HD 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 10W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. బ్యాటరీ బలంగా ఉంటుంది. రోజంతా సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో 4G LTE, బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS సపోర్ట్ చేస్తుంది. ఈ కనెక్టివిటీ అన్ని అవసరమైన వాటిని కవర్ చేస్తుంది. ఇతర ఫీచర్లలో 3GB వరకు వర్చువల్ ర్యామ్, DTS ప్రాసెసింగ్, పవర్ మారథాన్ టెక్, ఫోటో కంప్రెసర్, 360 ఫ్లాష్‌లైట్, ఐ కేర్, AI గ్యాలరీ, మెమ్-ఫ్యూజన్, DTS సౌండ్ ఉంటాయి.

Tags:    

Similar News