Google Search: గూగుల్‌లో ఇవి సెర్చ్ చేయవద్దు.. చిన్న కారణం పెద్ద ప్రమాదం..!
Google Search: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఇంటర్నెట్ సాయంతో అన్ని పనులు ఆన్‌లైన్‌లో చేస్తున్నారు.
Google Search: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఇంటర్నెట్ సాయంతో అన్ని పనులు ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. ఏ విషయం గురించి సమాచారం కావాలన్నా గూగుల్ ని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ గూగుల్‌తో జర జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయడం వల్ల జైలుకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. నేరం రుజువైతే మీపై కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకే ఎలాంటి విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం.
బాంబుల తయారీ
గూగుల్‌లో బాంబుల తయారీ గురించి సెర్చ్ చేస్తే ప్రభుత్వ సంస్థలు ఐపీ అడ్రస్ ఆధారంగా మీ ల్యాప్ టాప్, ఫోన్‌ని గుర్తిస్తాయి. ట్రాక్ చేసి కేసు నమోదు చేసి జైలుకి పంపిస్తాయి. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. ఇలా చేసి దొరికితే కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే సరదాకి కూడా ఈ విషయాన్ని గూగుల్‌లో వెతకొద్దు.
ఆయుధాల సమాచారం
ఆయుధాల గురించి తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేస్తే ప్రమాదంలో పడుతారు. ఎందుకంటే చాలామంది నేరస్థులు ఆయుధాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాటిని అక్రమ మార్గాల ద్వారా పొంది పలు ప్రమాదాలకి కారణం అవుతారు. అందుకే ఇలాంటి కంటెంట్‌ని గూగుల్‌లో వెతకొద్దు.
అబార్షన్ సమాచారం
మన దేశంలో అభార్షన్లు చట్టరీత్యా నేరం. అబార్షన్ ఎలా చేయాలి అనే కీ వర్డ్స్ ను గూగుల్ లో అస్సలు వెతకొద్దు. ఇలాంటివి చేసిన వారిని కూడా నిఘా సంస్థలు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాయి.
చైల్డ్ పోర్నోగ్రఫీ
చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి కూడా భారత ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. గూగుల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం అస్సలు వెతకొద్దు. ఒకవేళ వెతికితే POSCO యాక్ట్ కింద జైలుకు వెళ్లే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.