Smartphone Addicted: ఈ లక్షణాలు ఉంటే స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైనట్లే..!

Smartphone Addicted: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తుంది. దీనివల్ల అన్ని పనులు సులువుగా మారాయి. అలాగే కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.

Update: 2024-03-24 11:30 GMT

Smartphone Addicted: ఈ లక్షణాలు ఉంటే స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైనట్లే..!  

Smartphone Addicted: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ కనిపిస్తుంది. దీనివల్ల అన్ని పనులు సులువుగా మారాయి. అలాగే కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. పెరిగిన టెక్నాలజీ వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే జరుగుతోంది. ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు గంటలు సెల్‌ఫోన్‌లోనే జీవితం గడుపుతున్నారని ఒక పరిశోధనలో తేలింది. ఇందులో కనీసం మూడోవంతు కుటుంబానికి కేటాయించినా బంధాలు బలపడతాయి. స్నేహితులకూ కేటాయిస్తే అనుబంధాలు వికసిస్తాయి. పుస్తకం చదివితే కొత్త ఆలోచనలు వస్తాయి. ఒక వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యాడనడానికి ఈ లక్షణాలు ఉంటే చాలు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. పది నిమిషాలు సెల్‌ఫోన్‌ కనిపించకపోయినా ఒత్తిడికి, విపరీతమైన ఆందోళనకు గురికావడం.

2. ఐదు నిమిషాలకోసారి ఫోన్‌ చెక్‌ చేసుకోవడం.

3. తరచూ పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం, రీషేర్‌ చేసుకోవడం, లైక్స్‌ కొట్టడం. ఇతరులు కూడా అంతే వేగంగా స్పందించాలని కోరుకోవడం.

4. సోషల్‌ మీడియా కోసం అర్ధరాత్రి దాకా మేల్కోవడం, తెల్లవారుజామునే నిద్రలేవడం.

5. చేసే పనిమీద ఏకాగ్రత తగ్గిపోయి, స్మార్ట్‌ఫోన్‌ మీదే దృష్టిపెట్టడం.

6. వచ్చే ప్రతి నోటిఫికేషన్‌కూ స్పందించి వెనువెంటనే చెక్‌ చేసుకోవడం.

7. ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలయ్యారని అర్థం.

పొంచి ఉన్న సైబర్‌ దాడులు

గంటల కొద్దీ స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతుంటే సైబర్ నేరస్థుల దృష్టిలో పడే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత సమాచారం, ఫొటోలు మొదలైన వాటిని వారు హ్యాక్‌ చేసి మిమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేయడ, మీ అకౌంట్‌లోని డబ్బులు కొట్టేయడం వంటి సంఘటలకు పాల్పడే ఆస్కారం ఉంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఓ అలవాటుగా మొదలై వ్యసనంగా తీవ్ర వ్యసనంగా పరిణమించిందంటే ఇక జీవితం మన చేతుల్లో ఉండదు. మన ఆలోచనలు మన పరిధిలో ఉండవు. అందులోనూ డిజిటల్‌ వ్యసనం మద్యం కంటే మత్తునిస్తుంది. ఇలాకాకముందే దాని నుంచి బయటపడడం ఉత్తమం.

Tags:    

Similar News