Gmail AI: జీమెయిల్‌లో ఏఐ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..

Gmail AI: జీమెయిల్‌లో ఏఐ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..

Update: 2024-07-08 01:30 GMT

Gmail AI: జీమెయిల్‌లో ఏఐ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే.. 

Gmail AI: ఒకప్పుడు కేవలం కొందరు మాత్రమే జీమెయిల్‌ను ఉపయోగించే వారు. కానీ ఎప్పుడైతే స్మార్ట్‌ ఫోన్స్ వినియోగం పెరిగిందో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా మెయిల్‌ను ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక స్మార్ట్‌ఫోన్‌లోనే సులభంగా మెయిల్ యాక్సెస్ చేసుకునే అవకాశం లభించింది. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరిగిన నేపథ్యంలో జీమెయిల్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా ఫీచర్‌.? ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనకు వచ్చే మెయిల్స్‌లో టెక్ట్స్‌ సుదీర్ఘంగా ఉంటుంది. వీటిని పూర్తిగా చదవడం సమయంతో కూడుకున్న అంశం. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. సింగిల్-థ్రెడ్ ఇమెయిల్‌లలో ఈ ఫీచర్ పని చేయదని తెలుస్తోంది. మీరు మెయిల్‌కు కనీసం రెండు సార్లు రిప్లై ఇస్తేనే ఈ ఏఐ ఫీచర్‌ బటన్‌ కనిపిస్తుంది. మీకు వచ్చిన మెయిల్‌లోని ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఏఐ బటన్‌పై క్లిక్‌ చేస్తే కొన్ని సెకన్లలోనే మెయిల్‌లోని ముఖ్యమైన వివరాలను పాయింట్ల రూపంలో మీకు అందిస్తుంది.

ఇదిలా ఉంటే జీమెయిల్‌లో కొత్తగా సైడ్‌ ప్యానెల్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇది జెమిని 1.5 ప్రోలో పనిచేస్తుంది. ఈ ఫీచర్‌ సహాయంతో ఇమెయిల్‌ను రూపొందించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే ఇన్‌బాక్స్‌లో లేదా గూగుల్‌ డిస్క్‌ ఫైల్స్‌లో డేటాను వెతకడానికి సహాయపడుతుంది. స్లయిడ్‌లను క్రియేట్‌ చేయడానికి కూడా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. 

Tags:    

Similar News