Chat GPT: చాట్ జీపీటి నుంచి ప్రతినెలా లక్షల సంపాదన.. ఇంట్లో కూర్చొనే చేస్తున్నారు..!
Chat GPT: సెర్చ్ ఇంజిన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా చాట్ జీపీటీ(Chat GPT)మారింది.
Chat GPT: సెర్చ్ ఇంజిన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా చాట్ జీపీటీ(Chat GPT)మారింది. దీనివల్ల ప్రజలు అతి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తున్నారు. చాట్ జీపీటీ చాలా ప్రజాదరణ పొందింది. అంతేకాదు గూగుల్‌కి పెద్ద సమస్యలా తయారైంది. చాట్ జిపిటికి రోజురోజుకి జనాదరణ పెరగడం వెనుక పెద్ద కారణం ఉంది. దీని నుంచి వచ్చే ఆదాయమే ఇందుకు కారణం. అవును మీరు దీన్ని జోక్‌గా తీసుకుంటే పప్పులో కాలేసినట్లే. వాస్తవానికి చాలామంది చాట్ జీపీటీతో సంపాదిస్తున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.
చాలామంది కంటెంట్ రూపొందించడానికి చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు. సంపాదించడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. క్రియేటర్‌లు యూట్యూబ్‌లో వీడియోను రూపొందించాలనుకున్నప్పుడు ముందుగా కంటెంట్‌ను సిద్ధం చేయాలి. ఆపై ఆ కంటెంట్‌ను యాంకరింగ్ చేయాలి. ఆ తర్వాత వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ విధంగా చేస్తే వీడియోలను రూపొందించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఈ సమయం దాదాపుగా తగ్గిపోయింది.
కంటెంట్‌ని రూపొందించడానికి వ్యక్తులు ఇప్పుడు చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు కంటెంట్ సేకరించి దానిని కొన్ని AI సాఫ్ట్‌వేర్‌లకు అప్‌లోడ్ చేస్తున్నారు. AI వాయిస్ లేదా AI యాంకర్ ఈ కంటెంట్‌ని చదువుతున్నారు. కొన్ని నిమిషాలలోనే వీడియో రెడీ అవుతోంది. దీనికి కొన్ని ఫోటోలు యాడ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ విధంగా యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తులు ప్రతి నెలా లక్షలు సంపాదిస్తున్నారు.