Smartphone Update: మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌డేట్‌ చేయడం లేదా.. వేల రూపాయలు నష్టపోతారు..!

Smartphone Update: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తరచుగా న్యూ అప్‌డేట్‌లను రిలీజ్‌ చేస్తుంటాయి. వీటిని ఇన్‌స్టాల్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ సాఫీగా రన్ అవుతుంది.

Update: 2023-10-29 06:30 GMT

Smartphone Update: మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌డేట్‌ చేయడం లేదా.. వేల రూపాయలు నష్టపోతారు..!

Smartphone Update: స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తరచుగా న్యూ అప్‌డేట్‌లను రిలీజ్‌ చేస్తుంటాయి. వీటిని ఇన్‌స్టాల్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ సాఫీగా రన్ అవుతుంది. ఫోన్‌కి అనేక న్యూ ఫీచర్లు యాడ్‌ అవుతాయి. కానీ కొంతమంది స్టోరేజీ తగ్గుతుందనే భయంతో స్మార్ట్‌ఫోన్‌ను అప్‌డేట్ చేయరు. ఇది చాలా పెద్ద తప్పు. ఫోన్‌ను అప్‌డేట్ చేయకపోతే అది ఫోన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్లో సమస్య

స్మార్ట్‌ఫోన్‌ అప్‌డేట్‌ చేయకుంటే ఫోన్‌ స్లో అవుతుంది. మల్టీ టాస్కింగ్ పనులు చేయలేరు. గేమ్‌లు ఆడటం వీడియోలను చూడటంలో సమస్యను ఎదుర్కొంటారు. స్మార్ట్‌ఫోన్‌ స్లో కావొద్దంటే కంపెనీ అప్‌డేట్లను ఫాలో కావాల్సి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ పేలిపోయే ప్రమాదం

స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకుంటే చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది ఫోన్‌ వేడెక్కడం. స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ అప్‌డేట్ కాకపోవడం వల్ ఫోన్‌ స్లో అవుతుంది. తర్వాత వేడెక్కడం మొదలవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే బ్యాటరీపై ప్రభావం పడుతుంది. కొన్నిరోజులకు బ్యాటరీ బాగా వేడెక్కి బాంబులా పేలుతుంది.

మదర్‌బోర్డ్‌ ఎఫెక్ట్‌

మీరు స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను చాలా కాలంగా అప్‌డేట్ చేయకుంటే మదర్‌బోర్డ్ పై ఎఫెక్ట్‌ పడుతుంది. పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది. తర్వాత దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాల్స్‌ చేయలేరు మెస్సేజ్‌లు పంపడానికి వీలుండదు.

వేడెక్కడం సమస్య

స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం వల్ల ఫోన్‌ పనితీరు మెరుగవుతుంది. స్పీడ్‌ పెరుగుతుంది. దీంతో ఫోన్‌ వేడెక్కడం సమస్య ఉండదు. స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్‌లను విస్మరిస్తే సమస్య మరింత పెరుగుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Tags:    

Similar News