Reduce Electric Bill: ఏసీ వల్ల కరెంట్ బిల్ పెరిగిపోతుందా.. ఈ చిన్న ట్రిక్ వల్ల డబ్బు ఆదా..!
Reduce Electric Bill: ఈ రోజుల్లో చాలామంది ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ తర్వాత చాలా బాధపడుతున్నారు.
Reduce Electric Bill: ఈ రోజుల్లో చాలామంది ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ తర్వాత చాలా బాధపడుతున్నారు. కారణం కరెంట్ బిల్ ఎక్కువ రావడమే. ఎయిర్ కండీషనర్లు ఉపయోగించడం వల్ల విద్యుత్ బిల్లు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఎయిర్ కండీషనర్ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఏసీ వాడటం తప్పనిసరి అయితే కరెంట్ బిల్ తగ్గించుకోవడానికి చిన్ని ట్రిక్ అప్లై చేయాలి. దీనివల్ల సులభంగా కరెంట్ బిల్లునుంచి బయటపడుతారు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
సాధారణంగా ఎయిర్ కండీషనర్‌ని తక్కువ టెంపరేచర్ వద్ద సెట్ చేస్తారు. దీనివల్ల 3 నుంచి 4 నిమిషాలలో గది మొత్తం చల్లగా మారుతుంది. కానీ దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. వాస్తవానికి ఎయిర్ కండీషనర్‌ని 28 డిగ్రీల టెంపరేచర్ వరకు ఉపయోగించవచ్చు. అయితే చాలామంది దీనిని తక్కువ టెంపరేచర్‌లో నడుపుతారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. కరెంట్ బిల్లు అధికమవుతుంది.
గదిని తొందరగా చల్లబరచకుండా నిదానంగా చల్లగా చేయడానికి ఎయిర్ కండీషనర్ టెంపరేచర్‌ని 25 డిగ్రీల నుంచి 28 డిగ్రీల మధ్య సెట్ చేయండి. దీనివల్ల 10 నిమిషాల వ్యవధిలో రూమ్ టెంపరేచర్ తగ్గుతుంది. అలాగే విద్యుత్ వినియోగం నార్మల్‌గా జరుగుతుంది. దీంతో ప్రతి నెలా వచ్చే కరెంటు బిల్లు తగ్గుతుంది. ఏసీలో ఈ చిన్న టెంపరేచర్ సెట్టింగ్ చేయడం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతాయి.