Selling Old Mobile: స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి పెట్టారా.. గుర్తుంచుకోండి ఈ పని చేయకుంటే మోసపోతారు..!

Selling Old Mobile: ఈ రోజుల్లో యువత మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ రావడంతో పాత ఫోన్‌ను అమ్మేస్తున్నారు. తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2023-12-02 15:00 GMT

Selling Old Mobile: స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి పెట్టారా.. గుర్తుంచుకోండి ఈ పని చేయకుంటే మోసపోతారు..!

Selling Old Mobile: ఈ రోజుల్లో యువత మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ రావడంతో పాత ఫోన్‌ను అమ్మేస్తున్నారు. తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ఫోన్‌ కొనడం మంచిదే కానీ పాత ఫోన్‌ను అమ్మేటప్పుడు కొన్ని విషయాలను పరిశీలించాలి. లేదంటే చాలా నష్టపోతారు. ఈ రోజు స్మార్ట్‌ఫోన్‌ అమ్మే విషయంలో కొన్నిముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.

బ్రౌజర్ నుంచి సేవ్ చేసిన పాస్‌వర్డ్‌ను తొలగించండి

ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు చాలాసార్లు పాస్‌వర్డ్‌ను బ్రౌజర్‌లోనే సేవ్ చేస్తాం. ఈ పరిస్థితుల్లో ఫోన్‌ను విక్రయించిన తర్వాత ఈ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఎవరైనా మీ ఖాతాను హ్యాక్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు అనుకోకుండా నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మొదలైన ఏవైనా వివరాలను సేవ్ చేశారని అనుకుందాం. ఫోన్ కొనుగోలుదారుకు దీని గురించి తెలిస్తే మీరు భారీ నష్టాన్ని చూస్తారు. ఈ పరిస్థితిలో ఫోన్‌ను విక్రయించే ముందు బ్రౌజర్ సెట్టింగ్‌లకు వెళ్లి పాస్‌వర్డ్‌ను తొలగించాలి. తద్వారా భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది.

రీసెట్ చేయాలి

ఫోన్‌ను విక్రయించే ముందు ఫోన్‌ను రీసెట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మొబైల్‌లోని మొత్తం డేటా ఒకేసారి తొలగిపోతుంది. వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉండదు. ఫోన్‌ను విక్రయించేటప్పుడు తొందర పాటు ఉండకూడదు. మైక్రో SD కార్డ్ తీసుకోవడం మరిచిపోవద్దు. లేదంటే SDలో మీ ఆర్థిక డేటాను ఉపయోగించి స్కామ్‌ జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకొని మిమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మైక్రో SD కార్డ్ ను తీసుకోవడం మరిచిపోవద్దు.

google అకౌంట్‌ను తొలగించండి

మొబైల్‌ను విక్రయించే ముందు పరికరం నుంచి Google అకౌంట్ నుంచి లాగ్ అవుట్ కండి. చాలామంది ఈ పనిచేయకుండానే ఫోన్‌ విక్రయిస్తారు. దీనివల్ల చాలాసమస్యలు ఎదురవుతాయి. ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి Google ఖాతాను క్లోజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ డేటా లీక్ కాకుండా నిరోధించవచ్చు.

Tags:    

Similar News