Inverter Mistakes: ఇన్వర్టర్ విషయంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. పేలుతుంది జాగ్రత్త..!

Inverter Mistakes: నేటి కాలంలో ఇంట్లో ఇన్వర్టర్ల వాడకం పెరిగిపోయింది. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2024-05-25 10:30 GMT

Inverter Mistakes: ఇన్వర్టర్ విషయంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. పేలుతుంది జాగ్రత్త..!

Inverter Mistakes: నేటి కాలంలో ఇంట్లో ఇన్వర్టర్ల వాడకం పెరిగిపోయింది. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఎండాకాలం, వానాకాలం అని తేడా లేకుండా అన్ని కాలాల్లో ఇన్వెర్టర్ల అవసరం ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే దీని అవసరం మరింత ఏర్పడుతుంది. అయితే ఇన్వర్టర్ విషయంలోచాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి పేలి ప్రాణనష్టం జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఇన్వర్టర్ మెయింటెనెన్స్ కచ్చితంగా పాటించాలి. ఈ రోజు ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఇన్వర్టర్ను ఎక్కువ సేపే ఛార్జ్ చేయకూడదు. కంపెనీ రూల్స్ అతిక్రమించ కూడదు . అలాగే మంచి ఛార్జ్ కంట్రోలర్‌ను ఉపయోగించాలి. దీనివల్ల బ్యాటరీ కండీషన్లో ఉంటుంది. బ్యాటరీ వాటర్‌తో నడుస్తుంటే వాటర్‌ స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. నీటి స్థాయి తక్కువగా ఉంటే బ్యాటరీ లోపల వేడి పెరిగి పేలుడు సంభవించే అవకాశాలు ఉంటాయి. బ్యాటరీని అధిక వేడి లేదా ప్రత్యక్ష సూర్యకాంతి తగిలేవిధంగా ఉంచకూడదు. అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీని వేడెక్కెలా చేస్తాయి. దీనివల్ల పేలిపోయే అవకాశాలు ఉంటాయి. బ్యాటరీ టెర్మినల్స్‌పై తుప్పు లేదా ధూళి చేరడం వల్ల బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అందుకే బ్యాటరీని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, టెర్మినల్స్‌పై పెట్రోలియం జెల్లీ లేదా మరేదైనా లూబ్రికెంట్‌ను అప్లై చేస్తూ ఉండాలి.

బ్యాటరీలను ఎల్లప్పుడూ వెంటిలేషన్ ఉండే ప్రాంతంలో స్టోర్చేయాలి. బ్యాటరీ వాయువును విడుదల చేస్తే పేలుడు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే బ్యాటరీలు వెంటిలేషన్‌ ఉన్న ప్రాంతంలోనే ఉంటే ఆ వాయువులు గాలిలో కలవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. తప్పు వైరింగ్ కూడా బ్యాటరీకి ప్రమాదకరం. మంచి నాణ్యత గల కంపెనీ కేబుల్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఎప్పుడైనా బ్యాటరీ నుంచి ఏదైనా వాసన వస్తున్నట్లయితే వెంటనే ఎలక్ట్రీషియన్ను పిలిపించి చూయించాలి. కానీ మీరు ఏది చేయకూడదు. అలాగే ఇన్వర్టర్ను పిల్లలకు దూరంగా ఉండేవిధంగా చూసుకోవాలి.

Tags:    

Similar News