SIM Card Cloning: సైబర్‌ అలర్ట్‌.. సిమ్‌కార్డ్‌ క్లోనింగ్‌తో ఖాతా ఖాళీ చేస్తున్నారు జాగ్రత్త..!

SIM Card Cloning:టెక్నాలజీ పెరగడంతో ఈరోజుల్లో అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి.

Update: 2023-08-12 14:30 GMT

SIM Card Cloning: సైబర్‌ అలర్ట్‌.. సిమ్‌కార్డ్‌ క్లోనింగ్‌తో ఖాతా ఖాళీ చేస్తున్నారు జాగ్రత్త..

SIM Card Cloning: టెక్నాలజీ పెరగడంతో ఈరోజుల్లో అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి. అయితే వీటితో పాటు సైబర్‌ నేరాలు కూడా పెరుగుతున్నాయి. పెరిగిన సాంకేతికతని హ్యాకర్లు వారికి అనుకూలంగా వాడుకుంటున్నారు. అనేక ట్రిక్స్‌ ప్లే చేసి కష్టపడి సంపాదించిన డబ్బుని సులువుగా దోచుకుంటున్నారు. కొన్నిసార్లు ఓటీపీ నెంబర్‌తో మరికొన్ని సార్లు సిమ్‌ కార్డ్‌ క్లోనింగ్‌ పద్దతిని ఉపయోగించి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కొట్టేస్తున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

సిమ్‌ కార్డ్‌కు సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పొరపాటు వల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఒక క్షణంలో బ్యాంకు ఖాతా పూర్తిగా ఖాళీ అవుతుంది. హ్యాకర్లు తమను తాము టెలికాం కంపెనీ ఉద్యోగులుగా చెప్పుకుంటు కాల్ చేస్తారు. ప్రజలను ట్రాప్ చేయడానికి ఆకర్షణీయమైన ఆఫర్లని ఎరగా వేస్తారు. తర్వాత టెక్స్ట్ మెస్సేజ్‌లు పంపుతారు. ఆఫర్‌ను యాక్టివేట్ చేయడానికి ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలని సూచిస్తారు. అత్యాశలో లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే సమాచారం వారికి చేరిపోతుంది. దీంతో బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుని మొత్తం ఊడ్చేస్తారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సిమ్ క్లోనింగ్‌ అయిన వెంటనే ఒరిజినల్ సిమ్ క్లోజ్‌ అవుతుంది. తర్వాత హ్యాకర్లు OTP ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి ఈ మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తారు. SIM కార్డ్‌ని క్లోనింగ్ చేయడం అంటే మీ SIMకి డూప్లికేట్‌ తయారుచేయడం. సిమ్‌కార్డు అప్‌గ్రేడ్‌ చేయాలని లేదంటే ఓటిపీ చెప్పాలని ఎవరైనా కోరితే అస్సలు నమ్మవద్దు. తెలియకుండా వారికి సమాచారం అందిస్తే కోలుకోలేని నష్టం జరిగినట్లే అని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News