Portable AC Mini Cooler: ఈ పోర్టబుల్‌ ఎయిర్‌ కూలర్‌ సూపర్.. ధర కేవలం రూ. 998 మాత్రమే..!

Portable AC Mini Cooler: ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2024-05-03 16:00 GMT

Portable AC Mini Cooler: ఈ పోర్టబుల్‌ ఎయిర్‌ కూలర్‌ సూపర్.. ధర కేవలం రూ. 998 మాత్రమే..!

Portable AC Mini Cooler: ఎండలు మండిపోతున్నాయి. ప్రతిరోజు 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణం వేడిగా ఉక్కపోతగా ఉంటుంది. కొద్దిసేపు కూలర్‌, ఫ్యాన్‌, ఏసీ ఆఫ్‌ చేస్తే చెమటలు కారుతూ ఉంటాయి. అయితే కొంతమంది సిస్టమ్స్‌, ల్యాప్‌టాప్‌ దగ్గర కూర్చొని గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుంది. వారికి ఈ వేడి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారికి పోర్టబుల్‌ మినీ కూలర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది చల్లదనా న్ని ఇవ్వడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందిపడుకుండా సులువుగా పనిచేసుకోగలుగుతారు. ఈ రోజు దీని ధర, ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

మార్కెట్‌లోకి సీఆర్టీఎల్ తయారు చేసిన కొత్త పోర్టబుల్ ఎయిర్ కూలర్ వచ్చింది. ఇది ఒకరికి సరిపోతుంది. ముఖ్యంగా ఎండకాలంలో పిల్లలకు ఇది చాలా బాగుంటుంది. అలాగే ల్యాప్ టాప్, కంప్యూటర్ వాడేవారికి చల్లదనం ఇస్తుంది. దీని బరువు 299గ్రాములు మాత్రమే. ఈ ఎయిర్ కూలర్ ను అమెజాన్ లో చాలా మంది కొంటున్నారు. 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు. ఇది అన్ని రకాలుగా బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. వాడేందుకు తేలికగా ఉంటుందని ఫ్యాన్ కు మూడు బ్లేడ్స్ ఉన్నాయని..అది సౌండ్ లేకుండా తిరుగుతుందని చెబుతున్నారు.

ఈ ఎయిర్ కూలర్ కొన్ని గంటలపాటు, గాలిని ఇస్తుందని తర్వాత గదితోపాటు శరీరాన్ని కూడా కూల్‌ చేస్తుందని చెబుతున్నారు. ఇది తక్కువ బరువు ఉంటమే కాదు దీనికి నైట్ లైట్ కూడా ఉంది. అందువల్ల రాత్రివేళ ఈ లైట్ వేసుకుంటే చాలా బాగుంటుందని తెలిపారు. ఈ ఎయిర్ కూలర్ 90శాతం దాకా కరెంటును ఆదా చేస్తుందని, ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవని దీనిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఎయిర్ కూలర్ కు 3 ఎయిర్ స్పీడ్ ఆప్షన్స్ ఉండటంతో కావాల్సినంత స్పీడ్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ కూలర్ ను మొబైల్ యూఎస్బీ పోర్ట్, ల్యాప్ టాప్ యూఎస్బీ పోర్ట్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ కూలర్ అసలు ధర రూ. 4,999కాగా అమెజాన్ లో దీనిపై 80శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.998 కే వస్తుంది.

Tags:    

Similar News