ChatGPT Integration Smartwatch: స్మార్ట్‌వాచ్‌లో చాట్‌జిపిటి ఇంటిగ్రేషన్.. నీటిలో కూడా చెడిపోదు.. ధర ఎంతంటే..?

ChatGPT Integration Smartwatch: క్రాస్‌బీట్స్‌ గత నెలలో చాట్‌జిపిటి స్మార్ట్‌వాచ్‌ని విడుదల చేసింది. ఇప్పుడు వాచ్ అమ్మకానికి వచ్చింది.

Update: 2023-11-18 09:30 GMT

ChatGPT Integration Smartwatch: స్మార్ట్‌వాచ్‌లో చాట్‌జిపిటి ఇంటిగ్రేషన్.. నీటిలో కూడా చెడిపోదు.. ధర ఎంతంటే..?

ChatGPT Integration Smartwatch: క్రాస్‌బీట్స్‌ గత నెలలో చాట్‌జిపిటి స్మార్ట్‌వాచ్‌ని విడుదల చేసింది. ఇప్పుడు వాచ్ అమ్మకానికి వచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో చాట్‌జిపిటి ఇంటిగ్రేషన్ ఉంది. ఇది భారతదేశంలోని చాలా స్మార్ట్‌వాచ్‌ల కన్నా భిన్నంగా ఉంటుంది. మీరు అధికారిక వెబ్‌సైట్ నుంచి వాచ్‌ని కొనుగోలు చేయవచ్చు. Crossbeats Nexus ధర, ఫీచర్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

క్రాస్‌బీట్స్ నెక్సస్ ధర

Crossbeats Nexus స్టైల్, ఫంక్షనాలిటీని మిళితం చేసే కొత్త స్మార్ట్‌వాచ్. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.5,999. రెండు స్టైలిష్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. సిల్వర్, బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది. మీరు Crossbeats Nexusని ముందస్తుగా ఆర్డర్ చేస్తే అనేక ప్రయోజనాలకు పొందుతారు. అదనంగా 6 నెలల పొడిగించిన వారంటీని, ప్రీ-ఆర్డర్ చేసినప్పుడు మీరు ఎంచుకున్న ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఉత్పత్తులపై 25% తగ్గింపును, చివరగా కొనుగోలు చేసిన రోజున అదనంగా 5% తగ్గింపును పొందవచ్చు.

క్రాస్‌బీట్స్ నెక్సస్ స్పెక్స్

Crossbeats Nexus 2.1-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని రిజల్యూషన్ 320 x 384 పిక్సెల్‌లు. ఈ వాచ్ 500 కంటే ఎక్కువ ముఖాలతో ఫేస్‌లతో వస్తుంది. వినియోగదారులకు అనేక రకాల ఆప్షన్స్‌లను అందిస్తోంది. ఈ వాచ్ ఈ బుక్ రీడర్, GPS డైనమిక్ రూట్ ట్రాకింగ్, డైనమిక్ ఐలాండ్ వంటి ప్రాక్టికల్ ఫీచర్‌లతో వినియోగదారులను కొత్త అనుభూతికి తీసుకువెళుతుంది.

ఇది అల్టిమీటర్, బేరోమీటర్, దిక్సూచి వంటి అదనపు సామర్థ్యాలను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు ఎత్తు, పీడనం, దిశను అందిస్తుంది. నావిగేషన్ కోసం మరింత ఉపయోగపడుతుంది. బ్లూటూత్ కాలింగ్ ద్వారా కమ్యూనికేషన్ మెరుగ్గా అందిస్తుంది. ఆరోగ్య పర్యవేక్షణ విషయంలో నెక్సస్ హృదయ స్పందన రేటు, SpO2 స్థాయిలు, నిద్ర విధానాలను ట్రాక్ చేస్తుంది. అంతేకాకుండా రక్తపోటును పర్యవేక్షిస్తుంది. బ్లూటూత్ 5.3తో కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. ఇది iOS 10, అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ 5.1, అంతకంటే ఎక్కువ వెర్షన్‌లకు అనుకూలంగా ఉంటుంది. దీని బ్యాటరీ జీవితం 7 రోజుల వరకు వస్తుంది.

Tags:    

Similar News