Save Current Bill: కేవలం రూ.282 ఖర్చు చేస్తే కరెంట్‌ బిల్‌ ఆదా అవుతుంది.. ఎలాగంటే..?

Save Current Bill: ఎండాకాలంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది.

Update: 2023-06-23 15:00 GMT

Save Current Bill: కేవలం రూ.282 ఖర్చు చేస్తే కరెంట్‌ బిల్‌ ఆదా అవుతుంది.. ఎలాగంటే..?

Save Current Bill: ఎండాకాలంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఐదు నిమిషాలు కరెంట్‌ పోతే ఉక్కపోతకి ఎవరు తట్టుకోవడం లేదు. సాధారణంగా విద్యుత్‌ వినియోగం పెరగడంతో కరెంట్‌ బిల్‌ కూడా ఎక్కువగా వస్తుంది. సామాన్య ప్రజలు పెరిగిన కరెంట్ బిల్లుని తట్టుకోవడం కొంచెం కష్టమైన పనే. ఒకటి రెండు నెలలు అయితే పర్వాలేదు కానీ ప్రతి నెల కరెంట్‌ బిల్‌ ఇలాగే వస్తే తట్టుకోవడం చాలా కష్టం. మీరు కూడా ఈ సమస్యని ఎదుర్కొంటున్నట్లయితే ఈ విషయం తెలుసుకొని కరెంట్‌ బిల్‌ ఆదా చేయండి.

కేవలం రూ.282 ఖర్చు చేసి ఒక పరికరం కొంటే కరెంట్‌ బిల్‌ ఆదా చేసుకోవచ్చు. ఇది ఒక సోలార్‌ LED లైట్. సాధారణ LED లైట్ కంటే భిన్నంగా ఉంటుంది. దీన్ని ఇంటి టెర్రస్ లేదా మెట్లపై ఉండే రేకులపై ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు మెట్లపై నడిచినప్పుడు ఈ లైట్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. దీన్ని ఆన్ లేదా ఆఫ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఇది గొప్ప సౌర పరికరం. దీనివల్ల విడిగా లైటింగ్ చేయవలసిన అవసరం ఉండదు. కనీసం 1 అంతస్తులో విద్యుత్ పూర్తిగా ఉచితం అని చెప్పవచ్చు.

ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒక ఫ్లోర్‌లో ఈ లైటింగ్‌ని వాడండి కరెంటు బిల్లుని ఆదా చేసుకోండి. ఈ సోలార్‌ LED లైట్‌లోమోషన్ సెన్సార్, అలాగే సోలార్ ప్యానెల్, శక్తివంతమైన బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత గంటల తరబడి పని చేస్తుంది. అంతేకాకుండా సూర్యకాంతిలో నిరంతరం ఛార్జ్ అవుతుంది. ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.282 మాత్రమే ఉంటుంది. కరెంట్‌ బిల్లు ఆదాచేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది.

Tags:    

Similar News