Power Bank: ఈ పవర్‌ బ్యాంకుల ధర చాలా తక్కువ.. ఛార్జింగ్‌ సమస్యకి బెస్ట్‌ రెమిడి..!

Power Bank: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అన్ని పనులు ఆన్‌లైన్‌లో సులువుగా చేస్తున్నారు.

Update: 2023-09-15 15:00 GMT

Power Bank: ఈ పవర్‌ బ్యాంకుల ధర చాలా తక్కువ.. ఛార్జింగ్‌ సమస్యకి బెస్ట్‌ రెమిడి..!

Power Bank: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అన్ని పనులు ఆన్‌లైన్‌లో సులువుగా చేస్తున్నారు. అయితే అందరిని వేధించే అతి పెద్ద సమస్య ఛార్జింగ్‌. చాలామంది ఫోన్‌ ఛార్జింగ్‌ తొందరగా అయిపోవడం వల్ల తరచుగా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఇలాంటి సమయంలో పవర్‌ బ్యాంకు మెయింటెన్‌ చేస్తే చాలా ఉపయోగం. అయితే తక్కువ ధరలలో లభించే పవర్ బ్యాంక్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

M@TE పవర్ బ్యాంక్

ఈ పవర్‌ బ్యాంకుని అమెజాన్‌లో 13 శాతం తగ్గింపుతో కేవలం రూ.1299కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 20000mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌ను పొందుతారు.

కాపోనిక్స్ థండర్

ఈ పవర్‌ బ్యాంకు 20000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేయగలదు. దీని అసలు ధర రూ. 4,999 అయినప్పటికీ దీన్ని అమెజాన్‌లో 72 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,399కి పొందవచ్చు. ఇతర పవర్ బ్యాంక్‌లతో పోలిస్తే ఇది పరిమాణంలో చాలా స్లిమ్‌గా ఉంటుంది.

MI పవర్ బ్యాంక్

Mi పవర్ బ్యాంక్‌లో 20000mAh బ్యాటరీని పొందుతారు. ఇది 18W ఫాస్ట్ పవర్ డెలివరీతో వస్తుంది. అమెజాన్‌లో 7 శాతం తగ్గింపుతో రూ. 2,049కి పొందవచ్చు. దీన్ని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1,750 తగ్గింపుతో పొందవచ్చు.

రెడ్‌మి

రెడ్‌ మి పవర్‌ బ్యాంకుని 32 శాతం తగ్గింపుతో రూ. 2,049కి పొందచ్చు. ఇందులో మీకు 20000mAh బ్యాటరీ లభిస్తుంది. 10000mAh వంటి రెండు బ్యాటరీ ఆప్షన్స్‌ ఇందులో లభిస్తాయి.

Tags:    

Similar News