Smartphone: కొత్త ఫోన్‌ కొనాలని ఆలోచిస్తున్నారా.. ముందుగా ఈ విషయాలు గమనించండి..!

Smartphone: కొంతమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను చాలా సంవత్సరాలు ఉపయోగించడం వల్ల బోరింగ్‌గా ఫీలవుతారు.

Update: 2023-10-10 14:30 GMT

Smartphone: కొత్త ఫోన్‌ కొనాలని ఆలోచిస్తున్నారా.. ముందుగా ఈ విషయాలు గమనించండి..!

Smartphone: కొంతమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను చాలా సంవత్సరాలు ఉపయోగించడం వల్ల బోరింగ్‌గా ఫీలవుతారు. ఈ పరిస్థితిలో కొత్త ఫోన్‌ కొనాలని ఆలోచిస్తుంటారు. అయితే ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ పాతది కావొచ్చు. అది ఇంకా ఎటువంటి రిపేర్‌ లేకుండా చాలా రోజులు నడుస్తుంది. ఇలాంటి సమయంలో దానిని వదిలేసి కొత్తఫోన్ కొనడం మంచిది కాదు. దీనివల్ల డబ్బు వృథా తప్పించి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. అయితే కచ్చితంగా ఫోన్‌ మార్చాలంటే ఈ విషయాలను గమనించండి.

కొత్త మోడళ్ల ప్రారంభం: స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ఎప్పటికప్పుడు తేదీలను ప్రకటిస్తాయి. కొత్త మోడల్‌ ప్రారంభించిన వెంటనే మీరు వాటిని కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ఈ మోడల్స్‌ కొత్త డిజైన్, ఫీచర్‌లతో వస్తాయి. వాటి పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది.

పాత స్మార్ట్‌ఫోన్ పరిస్థితి: మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ పరిస్థితి గురించి బాగా తెలుసుకోవాలి. పాత స్మార్ట్‌ఫోన్ పనిచేయకపోయినప్పుడు, లేదా విరిగిపోయినప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం అవసరమవుతుంది.

బడ్జెట్: కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి అత్యంత ముఖ్యమైన విషయం బడ్జెట్. మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది అనేది ముఖ్యమైన అంశం. మీరు మీ బడ్జెట్‌కు అనుగుణంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవాలి లేదంటే నష్టం జరుగుతుంది.

ప్రత్యేక అవసరాలు: మీకు మంచి కెమెరా, గొప్ప బ్యాటరీ లైఫ్‌, గేమింగ్ కెపాసిటీ అవసరాలు ఉండొచ్చు. వాటికి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్‌ ఎంచుకుంటే మంచిది.

డిస్కౌంట్ ఆఫర్లు: కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ముందుగా ఆఫర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇలా చేయడం వల్ల కొనుగోలు సమయంలో మంచి తగ్గింపులను పొందవచ్చు. భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

Tags:    

Similar News