Selling Old Smartphone: పాత స్మార్ట్‌ఫోన్‌ అమ్ముతున్నారా.. ఇవి పాటిస్తే మంచి ధర పలుకుతుంది..!

Selling Old Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొని రోజులు గడిచాయంటే మార్కెట్‌లో దాని విలువ తగ్గుతూ ఉంటుంది.

Update: 2023-07-07 15:30 GMT

Selling Old Smartphone: పాత స్మార్ట్‌ఫోన్‌ అమ్ముతున్నారా.. ఇవి పాటిస్తే మంచి ధర పలుకుతుంది..!

Selling Old Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొని రోజులు గడిచాయంటే మార్కెట్‌లో దాని విలువ తగ్గుతూ ఉంటుంది. ఈ రోజుల్లోపాత స్మార్ట్‌ఫోన్‌ను మంచి ధరకి విక్రయించడం పెద్ద సవాలు లాంటిది. కొనుగోలుదారులు ఇలాంటి ఫోన్లకి తక్కువ ధర చెల్లిస్తారు. దీనివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించి పాత స్మార్ట్‌ఫోన్‌కు మంచి ధరకి ఎలా విక్రయించాలో ఈ రోజు తెలుసుకుందాం.

ప్యానెల్‌ మార్చాలి

పాత స్మార్ట్‌ఫోన్‌ను అమ్మేటప్పుడు ముందుగా ఒక విషయం గమనించాలి. ఇప్పటికే దాని ప్యానెల్‌పై చాలా గీతలు పడి ఉంటాయి. బయటి నుంచి చూసిన వారికి ఈ గీతల వల్ల ఫోన్‌ అంతగా నచ్చదు. అప్పుడు తక్కువ ధరకు ఆఫర్ చేస్తారు. ఇలాంటి సమయంలో పాత స్మార్ట్‌ఫోన్‌ను స్టైలిష్‌గా, కొత్తగా కనిపించడానికి తక్కువ ధరలో ప్యానెల్‌ను మార్చేయండి.

కెమెరా శుభ్రంచేయండి

పాత స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి ఫోటో తీసినప్పుడు ఫొటోలు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. కెమెరా సరిగ్గా శుభ్రం చేయకపోవడమే దీనికి కారణం. మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ అమ్ముతున్నట్లయితే ముందుగా దాని లెన్స్ లోపలి మురికిని తొలగించండి. అప్పుడు ఫొటోలు క్లారిటీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో ధర ఎక్కువగా పలుకుతుంది.

బ్యాటరీ కెపాసిటి పెంచండి

పాత స్మార్ట్‌ఫోన్‌ కొనేటప్పుడు చాలామంది ముందుగా బ్యాటరీ కెపాసిటీని చెక్‌ చేస్తారు. ఇలాంటి సందర్భంలో ముందుగా బ్యాటరి కెపాసిటిని పెంచండి. ఇందుకోసం ఫోన్‌ ఎక్కువగా వాడకూడదు. అప్పుడు బ్యాటరీ ఎక్కువ సమయం వచ్చేలా మారుతుంది. తద్వారా కస్టమర్‌ మంచిధర చెల్లించే అవకాశం ఉంటుంది.

డిస్‌ప్లే మార్చండి

పాత స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలో చిన్న చిన్న పగుళ్లు ఉంటే వెంటనే దానిని మార్చండి. ఎందుకంటే కస్టమర్‌ ఫోన్‌ని చూసినప్పుడు ఒక మంచి ఫీలింగ్‌ కలగాలి. అప్పుడే అతడు మంచి ధర చెల్లిస్తాడు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్‌ పాటిస్తే పాత స్మార్ట్‌ఫోన్‌ అమ్మడం సులువుగా జరుగుతుంది.

Tags:    

Similar News