Smartphone Selling Tips: పాత స్మార్ట్‌ఫోన్‌ అమ్ముతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ధర పలుకుతుంది..!

Smartphone Selling Tips: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు మార్చడం చాలామందికి అలవాటుగా మారింది.

Update: 2023-06-17 15:30 GMT

Smartphone Selling Tips: పాత స్మార్ట్‌ఫోన్‌ అమ్ముతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ధర పలుకుతుంది..!

Smartphone Selling Tips: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు మార్చడం చాలామందికి అలవాటుగా మారింది. మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ రావడమే ఆలస్యం వెంటనే బుక్‌ చేస్తున్నారు. ఇందుకోసం పాత స్మార్ట్‌ఫోన్‌ని అమ్మేస్తున్నారు. అయితే రోజులు గడిచిన కొద్ది పాత స్మార్ట్‌ఫోన్ ధర తగ్గుతూ ఉంటుంది. చివరకు దానిని అమ్మినప్పుడు చాలా తక్కువ ధరను చెల్లిస్తారు. ఇలాంటి సమయంలో పాత స్మార్ట్‌ఫోన్‌ని అధిక ధరకి ఎలా విక్రయించాలో ఈరోజు తెలుసుకుందాం.

ప్యానెల్‌ను మార్చాలి

పాత స్మార్ట్‌ఫోన్‌ను అమ్ముతున్నప్పుడు దానిపై చాలా గీతలు పడి ఉంటాయి. ఇవి ఫోన్‌ అందాన్ని పాడుచేస్తాయి. ఇలాంటి గీతలని చూసిన తర్వాత కస్టమర్లు తక్కువ ధర ఆఫర్ చేస్తారు. పాత స్మార్ట్‌ఫోన్‌ను స్టైలిష్‌గా, కొత్తగా కనిపించేలా చేయడానికి దాని ప్యానెల్‌ను మార్చాలి.

కెమెరా శుభ్రపరచాలి

పాత స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి ఫొటోలు తీసినప్పుడు మునుపటిలా క్లారిటీని పొందలేరు. కెమెరా సరిగ్గా శుభ్రం చేయకపోవడమే దీనికి కారణం. దాని లెన్స్ లోపల మురికి పేరుకుపోయి ఫొటోలు క్లారిటీగా రావు. ఈ పరిస్థితిలో కెమెరాని శుభ్రం చేసి విక్రయించే ప్రయత్నం చేయాలి.

బ్యాటరీ పెంచడం

స్మార్ట్‌ఫోన్‌ను అమ్మేటప్పుడు మొదట దాని బ్యాటరీని చెక్‌చేసుకోవాలి. కస్టమర్‌కు బ్యాటరీతో ఎటువంటి సమస్య ఉండకూడదు. అప్పుడే ఫోన్‌కి మంచి ధర పలుకుతుంది.

పగుళ్ల మరమ్మత్తు

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలో చిన్న చిన్న పగుళ్లు ఉంటే వెంటనే దాన్ని మార్చాలి. లేదంటే వాటిని చూసిన కస్టమర్‌ ఫోన్‌కి మంచి ధర చెల్లించడు.

Tags:    

Similar News