Redmi 13C 5G: రెడ్ మి 13సి 5జి స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా.. ఈ విధంగా డిస్కౌంట్ పొందండి..!
Redmi 13C 5G: మీరు రూ.10,000 లోపు బడ్జెట్‌లో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే రెడ్ మి 13సి 5జి స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.
Redmi 13C 5G: మీరు రూ.10,000 లోపు బడ్జెట్‌లో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే రెడ్ మి 13సి 5జి స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. రెడ్‌మి కంపెనీకి చెందిన ఈ చౌకైన 5జి స్మార్ట్‌ఫోన్ విక్రయం డిసెంబర్ 16 నుంచి అమెజాన్‌లో ప్రారంభమైంది. రెడ్‌మి 12 సి అప్‌గ్రేడ్ వెర్షన్ రెడ్‌మి 13C 5G. ఈ ఫోన్ కొంటే మీరు డబ్బు ఆదా చేసుకునే అవకాశాన్ని పొందుతారు. అమెజాన్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లు చెల్లింపు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
రెడ్‌మి 13 సి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
డిస్‌ప్లే: ఈ తాజా స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.
చిప్‌సెట్: MediaTek Dimension 6100 Plus ప్రాసెసర్ వేగం, మల్టీ టాస్కింగ్ కోసం ఉపయోగించారు.
కెమెరా సెటప్:సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో పాటు వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు.
బ్యాటరీ కెపాసిటీ:ఈ పరికరం 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
భారతదేశంలో Redmi 13C 5G ధర
ఈ సరికొత్త Redmi మొబైల్ ఫోన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. 4 GB RAM కలిగిన 128 GB వేరియంట్ ధర రూ.10,999. అదే సమయంలో ఈ పరికరం 6 GB RAM / 128 GB వేరియంట్ ధర రూ.12499. 8 GB RAM కలిగిన 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను వెండి, ఆకుపచ్చ, స్టార్‌లైట్, నలుపు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అయితే ICICI బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ప్రయోజనాన్ని పొందిన తర్వాత Redmi 13 5G 4 GB వేరియంట్ మీకు రూ. 9,999, 6 GB/128 GB వేరియంట్ మీకు రూ. 11,499 , 8 GB/256 GB వేరియంట్ ధర మీకు రూ.13,499 అవుతుంది.