Airtel Launches Rs 451 Prepaid Plan: ఐపీఎల్ క్రేజ్.. ఎయిర్‌టెల్ ఇస్తున్న బంపర్ ఆఫర్ అదిరిపోయిందిగా.. మూడు నెలలు పండగే..!

Airtel Launches Rs 451 Prepaid Plan: దేశంలో ఐపీఎల్ 2025 ఉత్సాహం జోరుగా సాగుతోంది. ఈ ఉత్సాహాన్ని ఉపయోగించుకోవడానికి వివిధ రకాలు కంపెనీలు పోటీపడుతున్నాయి.

Update: 2025-04-16 08:00 GMT
Airtel Launches Rs 451 Prepaid Plan

Airtel Launches Rs 451 Prepaid Plan: ఐపీఎల్ క్రేజ్.. ఎయిర్‌టెల్ ఇస్తున్న బంపర్ ఆఫర్ అదిరిపోయిందిగా.. మూడు నెలలు పండగే..!

  • whatsapp icon

Airtel Launches Rs 451 Prepaid Plan: దేశంలో ఐపీఎల్ 2025 ఉత్సాహం జోరుగా సాగుతోంది. ఈ ఉత్సాహాన్ని ఉపయోగించుకోవడానికి వివిధ రకాలు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఐపీఎల్ అభిమానులకు, క్రికెట్ మ్యాచ్‌లను చూడటానికి జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, తగినంత డేటా అవసరం. ఈ నేపథ్యంలోనే క్రికెట్ అభిమానుల కోసం ఇండియా రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ రూ. 451ని ప్రవేశపెట్టింది. ఇది హాట్‌‌స్టార్ యాక్సెస్‌ను అందించడమే కాకుండా డేటా అలవెన్స్‌తో కూడా వస్తుంది.

దేశపు రెండవ అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ రూ. 451కు వస్తుంది. ఓటీటీ ప్రయోజనంతో పాటు జియోహాట్‌స్టార్ ప్రయోజనం లభిస్తుంది. అయితే ఈ రూ.451 ఎయిర్‌టెల్ ప్లాన్‌లో ఎటువంటి అదనపు సర్వీస్‌లు అందించడం లేదు. ఈ ప్లాన్ పనిచేయాలంటే మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉండాలి.

Airtel Rs. 451 plan

ఎయిర్‌టెల్ రూ.451 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్‌‌లో 50GB డేటా లభిస్తుంది. జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను 3 నెలల పాటు అందిస్తుంది. ఈ ప్లాన్ తమ ఫోన్ల నుండి ఐపీఎల్‌ను స్ట్రీమ్ చేయాలనుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ ప్లాన్ కాకుండా, ఎయిర్‌టెల్ IPL 2025 కంటే ముందు అనేక ఇతర ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. వాటి ధరలు రూ. 100, రూ. 195. ఈ రెండు ప్లాన్‌లు కూడా డేటా వోచర్‌లే. రూ.100 ప్లాన్‌తో యూజర్లకు 5GB డేటా, రూ.195 ప్లాన్ తో 15GB డేటా లభిస్తుంది. రూ.100 ప్లాన్ జియోహాట్‌స్టార్ మొబైల్‌ను 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది, రూ.195 ప్లాన్ జియోహాట్‌స్టార్ మొబైల్‌ను 90 రోజులు వరకు పనిచేస్తుంది.

ఎయిర్‌టెల్‌లో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు సర్వీస్ వాలిడిటీని అందించే అనేక ఇతర ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లను కూడా ఉన్నాయి. ఆ ప్లాన్‌ల ధరలు రూ.3999, రూ.549, రూ.1029, రూ.398. ప్రస్తుతం ఎయిర్‌టెల్ తన అన్ని మొబైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో జియోహాట్‌స్టార్ మొబైల్ యాక్సెస్‌ను కూడా అందిస్తోంది.

Tags:    

Similar News