Gold in Smartphones: స్మార్ట్‌ఫోన్‌లో ఇంత బంగారం ఉంటుందా.. ఎలా బయటకు తీయాలి..!
Gold in Smartphones: స్మార్ట్‌ఫోన్‌లో బంగారం ఉంటుంది. బంగారం ఒక అద్భుతమైన కండక్టర్. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌లలోని అనేక చిన్న భాగాలలో దీన్ని ఉపయోగిస్తారు
Gold in Smartphones: దేశీయ ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. అలానే ప్రతి ఒక్కరికి ఇది అవసరమైన గ్యాడ్జెట్‌గా మారిపోయింది. ఈ నేపథ్యవంలో స్మార్ట్‌ఫోన్ గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే స్మార్ట్‌ఫోన్‌లో బంగారు ఉంటుందని మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ దానిని మీరు నమ్మకపోవచ్చు. ఒకసారి వాస్తవాన్ని పరిశీలిస్తే స్మార్ట్‌ఫోన్‌లో నిజంగా గోల్డ్ ఉంటుంది. మొబైల్‌లోని కొన్ని పార్ట్స్ తయారీలో బంగారం ఉపయోగిస్తారు. ఈ క్రమంలో ఫోన్‌లో ఉండే బంగారాన్ని విత్‌డ్రా చేయచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం ఒక అద్భుతమైన కండక్టర్. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌లలోని అనేక చిన్న భాగాలలో దీన్ని ఉపయోగిస్తారు. తద్వారా విద్యుత్ ప్రవాహం సరిగ్గా జరుగుతుంది. అదేవిధంగా బంగారం తుప్పు పట్టదు. అందువల్ల ఎక్కువ రోజులు మొబైల్ పార్ట్స్ క్షీణించకుండా ఉంటాయి. ఇది కాకుండా బంగారం అనువైన లోహం. దీని కారణంగా చాలా చిన్న, సున్నితమైన భాగాలలో ఉపయోగించవచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్‌లలో చాలా తక్కువ మొత్తంలో బంగారం ఉంటుంది.
సాధారణంగా కొన్ని మిల్లీగ్రాములు. ఈ పరిమాణం చాలా చిన్నది. దానిని వెలికితీసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అవును సాంకేతికంగా మీరు స్మార్ట్‌ఫోన్ నుండి బంగారాన్ని విత్‌డ్రా చేయవచ్చు. కానీ ఇది చాలా క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ. దీని కోసం మీకు అనేక రకాల రసాయనాలు ప్రత్యేక పరికరాలు అవసరం. అదే సమయంలో ఈ ప్రక్రియలో పర్యావరణం కూడా హాని కలిగించవచ్చు. కాబట్టి ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళడం తెలివైన పనికాదు.
మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో బంగారాన్ని విత్‌డ్రా చేయడం ద్వారా మీరు ధనవంతులు అవుతారని మీరు అనుకుంటే అది జరగదని మీరు అర్థం చేసుకోవాలి. బంగారాన్ని వెలికితీసే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా మీరు చాలా తక్కువ పరిమాణంలో బంగారాన్ని పొందుతారు. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం లేదా రీసైకిల్ చేయడం మంచిది.