Virat Kohli: సాల్ట్‌ను బలి తీసుకున్న కోహ్లీ... సోషల్‌మీడియాలో ఘోరంగా ట్రోలింగ్!
Virat Kohli: ఢిల్లీపై మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నిర్ణయం వల్ల ఫిల్ సాల్ట్ రనౌట్ కావడంతో అభిమానులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దాంతో పాటు ఆర్సీబీ విజృంభనకు పెద్ద బ్రేక్ పడింది. కోహ్లీపై "సెల్ఫిష్" అన్న విమర్శలే సోషల్ మీడియాలో హైలైట్ అయ్యాయి.

Virat Kohli: సాల్ట్‌ను బలి తీసుకున్న కోహ్లీ... సోషల్‌మీడియాలో ఘోరంగా ట్రోలింగ్!
Virat Kohli: విరాట్ కోహ్లి మరోసారి సోషల్ మీడియా వేదికగా విమర్శల పాలయ్యాడు. ఆర్సీబీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో, ఫిల్ సాల్ట్ రనౌట్ అయ్యిన విధానం చూసి అభిమానులు విరాట్‌ను 'సెల్ఫిష్'గా అభివర్ణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ తొలి దశలో విజృంభించిన సాల్ట్ హఠాత్తుగా అవుటవ్వడంతో ఆర్సీబీ లభించిన స్టార్టింగ్ మోమెంటమ్ పూర్తిగా దెబ్బతిన్నట్టు అయ్యింది.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, మొదట ఆర్సీబీకి బ్యాటింగ్ ఇచ్చింది. రెండో ఓవర్లోనే సాల్ట్ ఒక సిక్సర్, బౌండరీ కొట్టి ఆకట్టుకున్నాడు. తర్వాత మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్‌ను ధ్వంసం చేశారు. ఆ ఓవర్లోనే ఒక నో బాల్, ఫ్రీ హిట్ పై సిక్సర్, కొన్ని బై రన్స్‌తో కలిపి 30 పరుగులు వచ్చాయి. కేవలం మూడు ఓవర్లలోనే ఆర్సీబీ ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ వేగంగా వచ్చిన టీమ్ ఫిఫ్టీని సాధించింది.
అయితే, నాలుగో ఓవర్లో ఆ సంబరానికి బ్రేక్ పడింది. సాల్ట్ ఒక బంతిని విప్రజ్ నిగమ్ వైపు ఆడాడు. రన్ కోసం పరుగెత్తాడు. అయితే అదే సమయంలో విరాట్ వెనక్కి పంపడంతో సాల్ట్ మిడ్‌వేలో జారిపోయాడు. ఆ క్షణానికే కెఎల్ రాహుల్ స్టంప్స్ తీసి అతడిని రనౌట్ చేశాడు. సాల్ట్ 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
ఈ రనౌట్‌పై అభిమానుల ఆగ్రహం ఉవ్వెత్తున వెల్లువెత్తింది. కోహ్లీ నిర్ణయం, సమయ సద్వినియోగంపై అనేక విమర్శలు వచ్చాయి. చాలా మంది అతడిని స్వార్థపరుడిగా నిందించారు. సాల్ట్ అవుట్ అయిన వెంటనే ఆర్సీబీ రన్‌రేట్ బాగా పడిపోయింది. తర్వాత వచ్చిన పదిక్కల్ మాత్రం నిరాశపరిచాడు – 8 బంతుల్లో 1 పరుగుతో అవుట్ అయ్యాడు. విరాట్ తర్వాత ఓ సిక్సర్ కొట్టి కాసేపు ఆశ చూపినా, 14 బంతుల్లో 22 పరుగులతో అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతని ఆట తీరుపై ప్రశంసలు రావడం కాదు, విమర్శలే ఎక్కువగా వినిపించాయి.