Virat Kohli T20 Records: రికార్డులతో చెలరేగిన కోహ్లీ

Virat Kohli T20 Records: ఆదివారం ముగిసిన రెండో టీ20‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్‌లు నెలకొల్పాడు.

Update: 2021-03-15 13:33 GMT

విరాట్ కోహ్లీ (ఫొటో ట్విట్టర్)

Virat Kohli T20 Records: అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్ తో ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్‌లు నెలకొల్పాడు. మ్యాచ్‌లో టీమిండియా 165 పరుగుల లక్ష్య ఛేదనకి దిగగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (73 నాటౌట్: 49 బంతుల్లో 5x4, 3x6), ఓపెనర్ ఇషాన్ కిషన్ (56: 32 బంతుల్లో 5x4, 4x6) మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దాంతో.. ఐదు టీ20ల ఈ సిరీస్‌ 1-1తో సమానమైంది. మూడో టీ20 మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోనే మంగళవారం రాత్రి 7 గంటలకి జరగనుంది.

ఈ మ్యాచ్‌లో 73 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఇంటర్నేషనల్ టీ20ల్లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అలానే హాఫ్ సెంచరీ చేయడంతో.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు చేసిన క్రికెటర్‌గానూ నిలిచాడు. కోహ్లీకి టీ20 కెరీర్‌లో ఇది 26వ హాఫ్ సెంచరీకాగా.. అతని తర్వాత రోహిత్ శర్మ 25 అర్ధశతకాలు, మార్టిన్ గప్తిల్ 19 హాఫ్ సెంచరీలతో ఉన్నారు. ఇక కెప్టెన్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 12,000 పరుగులు చేసిన తొలి భారతీయుడిగా విరాట్ కోహ్లీ రెండో టీ20ల్లో 73 పరుగులు చేయడం ద్వారా నిలిచాడు.

ఇక పరుగుల యంత్రం కోహ్లీ ఈ మ్యాచ్‌ ద్వారా నమోదు చేసిన రికార్డులివి..

  1. టీ20ల్లో 3000 వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు.
  2. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయి చేరుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. 226 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఆ ఘనత సాధించాడు.
  3. టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా కోహ్లీ(26) రికార్డు సృష్టించాడు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్‌ (25), గప్తిల్‌ (19) ఉన్నారు.
Tags:    

Similar News