Viral: కోహ్లీ డకౌట్‌పై ఉత్తరాఖండ్ పోలీసుల మీమ్స్.. ఆపై తప్పంటూ డిలీట్

Uttarakhand Police: ఇంగ్లాండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 ‌లో విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు.

Update: 2021-03-13 16:09 GMT

విరాట్ కోహ్లీ (ఫొటో ట్విట్టర్)

Uttarakhand Police: ఇంగ్లాండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ అవకాశాన్ని ఉత్తరాఖండ్ పోలీసులు బాగా సద్వినియోగం చేసుకున్నారు. కోహ్లీ డకౌట్ ఫొటో తో వాహనదారులకు అవగాహన కల్పించేలా ఓ ట్వీట్ చేశారు. ''హెల్మెట్ వేసుకుంటే సరిపోదు. పూర్తి స్పృహతో వాహనం నడపాలి. ఒకవేళ అలా డ్రైవింగ్ చేయకపోతే విరాట్ కోహ్లీలా మీరూ డకౌట్ అవుతారు'' అని హెచ్చరించింది. దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నుంచి తీవ్రంగా విమర్శలు రావడంతో ఉత్తరాఖండ్ పోలీస్ విభాగం వెంటనే చేసిన తప్పిదానికి క్షమాణలు చెబుతూ, ఆ ఫొటోను, ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే కొంత మంది మాత్రం ఉత్తరా‌ఖండ్ పోలీసుల సెన్సాఫ్ హ్యూమర్ కి పొగడ్తలతో ముంచెత్తారు.

ఇంగ్లాండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్‌పైకి వెళ్లిన విరాట్ కోహ్లీ (0: 5 బంతుల్లో).. మిడాఫ్ దిశగా ఆడాలని చూశాడు. కానీ, పిచ్ నుంచి ఊహించని విధంగా బౌన్స్ రావడంతో.. బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్ క్రిస్ జోర్దాన్ చేతుల్లో పడింది.

ప్రస్తుతం కోహ్లీ ఫాంలో లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఫాంలో లేకపోతే సోషల్ మీడియాలో ఎలా ఆడుకుంటారో కోహ్లీ డకౌటే ఓ ఉదాహరణ. ఎంతో ఫేమ్ ఉన్నా సరే.. కేవలం బ్యాడ్ టైంలో ఇలా అభాసుపాలవడం సెలబ్రెటీలకు కొంత ఇబ్బందికర పరిణామమే. ఫాంలో ఉన్నప్పుడు హోరెత్తించే ఫ్యాన్స్... ఫాంలో లేకపోతే సోషల్ మీడియాలో మీమ్స్ తో వారి ఆగ్రహాన్ని చూపిస్తారు. అయితే ఓ వైపు విమర్శించే వారుంటే.. మరోవైపు వెన్నంటి ఉండే వారూ ఉంటారు. ఏదేమైనా హిట్ లో ఉంటే ఎంత ఎత్తు ఎక్కిస్తారో.. డౌన్ లో ఉంటే అంతే కిందకి గుంజేస్తారు.

భారత క్రికెటర్ల తప్పిదాల్ని ఇలా రోడ్డు ప్రమాదాల అవగాహన కోసం పోలీసులు వాడటం ఇదేమీ తొలిసారి కాదు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో జస్ర్పీత్ బుమ్రా నో బాల్ తప్పిదం కారణంగా.. ట్రోఫీని పాకిస్థాన్‌కి సమర్పించుకోవాల్సి వచ్చింది. దాంతో.. అప్పట్లో క్రీజు వెలుపల పాదం ఉంచి బుమ్రా బంతి విసురుతున్న ఫొటోని జైపూర్ పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బ్యానర్లుగా వేయించి మరీ.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. భారత్‌లో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ని ఇలా అవగాహన కోసం పోలీసులు వినియోగిస్తున్నారు.



అనంతరం పై ఫొటోను డిలీట్ చేసి మా ఉద్దేశం అది కాదంటూ..క్షమాపణలు చెప్తూ మరో ట్వీట్ పోస్టు చేసింది.


Tags:    

Similar News