కరోనా కట్టడికి ముత్తయ్య మురళీధరన్ భారీ విరాళం

కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా పారుకుపోతుంది. ఇప్పటికే 195 దేశాలకి పైగా విస్తరించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.

Update: 2020-04-02 06:34 GMT
Muttiah Muralitharan (File Photo)

కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా పారుకుపోతుంది. ఇప్పటికే 195 దేశాలకి పైగా విస్తరించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. దీన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ నీ ప్రకటించాయి.. అందులో ఒకటి శ్రీలంక ఒకటి.. ఇక శ్రీలంక లో146 కేసులే నమోదవగా, ఇందులో ముగ్గురు చనిపోయారు.

కరోనా పై శ్రీలంక ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సెలబ్రిటీలు తమ వంతు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తన వంతు సాయంగా 5 మిలియన్లు (శ్రీలంక రూపాయలు) విరాళంగా అందిస్తున్నట్లు శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్ మురళీధరన్ ప్రకటించాడు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని, ప్రభుత్వం ఒక్కటే అన్నీ చూసుకోలేదని గుర్తు చేశాడు. వీలైనంత సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరాడు..

ఇక కరోనా పై భారత్ చేస్తున్న పోరాటంలో భాగంగా భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు రోహిత్ శర్మ రూ. 80 లక్షలు, సురేశ్ రైనా రూ. 52 లక్షలు, సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షలు, గంగూలీ 50 లక్షలు, రహానె రూ. 10 లక్షలు ,విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి రూ. 3 కోట్లు విరాళం అందజేశారు.


Tags:    

Similar News