INDW vs SAW: నాలుగో వన్డేలో భారత్ ఓటమి

INDW vs SAW : దక్షిణాఫ్రికా, భారత మహిళల జట్టు మధ్య జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఘోర ఓటమిపాలైంది

Update: 2021-03-15 05:38 GMT

INDvsSAW(Image Source Cricinfo)

INDW vs SAW: దక్షిణాఫ్రికా, భారత మహిళల జట్టు మధ్య జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఘోర ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ‌్రికా ఏ వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. పూనమ్‌ రౌత్‌ సెంచరీతో (104 నాటౌట్‌) మెరవగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఆర్థ సెంచరీతో రాణించింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 3 వికెట్లకు 269 పరుగులు చేసి వియజాన్ని అందుకుంది. లిజెలీ లీ (69; 75 బంతుల్లో 10×4), కెప్టెన్‌ లారా వోల్వార్డ్‌ (53; 78 బంతుల్లో 6×4) హాఫ్ సెంచరీలు కదంతొక్కారు.

దక్షిణాఫ్రికా ప్లేయర్స్ సమిష్టిగా రాణించడంతో భారత స్టార్ ప్లేయర్ పూనమ్‌ రౌత్‌ (104 నాటౌట్‌; 123 బంతుల్లో 10×4) చేసిన అజేయ శతకం వృథా అయింది. సుదీర్ఘ విరామం తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న సిరీస్ ఇదే. అయితే స్వల్ప వ్యవధిలో లిజెల్, లారా ఔట్ అవ్వడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా విజయానికి 18 ఓవర్లలో 121 పరుగులు చేయాల్సిన దశలో లారా గుడ్‌ఆల్‌ (59 నాటౌట్‌; 66 బంతుల్లో 6×4), మిగ్నాన్ డు ప్రీజ్ (61; 55 బంతుల్లో 8×4, 1×6)కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య జరగాల్సిన నామమాత్రమైన అయిదో వన్డే ఈనెల 17న జరగనుంది.

మిథాలీ రాజ్‌ మరో మైలురాయిని అందుకుంది. మహిళల వన్డే క్రికెట్లో ఏడు వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. నాలుగో వన్డేలో మిథాలీ 26 పరుగులు వద్ద ఈ రికార్డు అందుకుంది. అంతకుముందు అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో మహిళా బ్యాటర్‌గా, తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News